విశాఖపట్నంహోమ్

జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం సక్సెస్

#MedicalCamp

విశాఖపట్నం లోని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డు నరవ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ 88వ వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇటీవల మృతి చెందిన జనసేన కుటుంబ సభ్యుడు సండ్రాని రవికుమార్ జ్ఞాపకార్థం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు నివాళులర్పించిన అనంతరం స్థానిక ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలను ఉచితంగా అందించారు.

మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచితంగా రక్తపోటు, మధుమేహం, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

సాయి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి అద్దాలు అవసరమైన వారికి 50 శాతం వరకు రాయితీ కల్పించారు. పేదలకు జనసేన పార్టీ తరఫున ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. క్లౌడ్ డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ 88వ వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గవర సత్తిబాబు, 88వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గంతకోరు శివ, జనసేన నాయకులు లింగం వాసు, గవర అప్పలరాజు, ప్రవీణ్, నవీన్, శివ, అశోక్‌తో పాటు పలువురు జనసైనికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా హైదరాబాద్

Satyam News

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

Satyam News

ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే జూరాల, శ్రీశైలం, సాగర్‌ కు నీళ్లు

Satyam News

22A భూముల వ్యవహారంలో ఏ-1 రేవంత్, ఏ-2 పొంగులేటి

Satyam News

న్యూస్‌క్లిక్‌పై ఈడీ కొరడా.. రూ 184 కోట్ల జరిమానా

Satyam News

Leave a Comment