26.3 C
Hyderabad
September 27, 2026
సినిమాహోమ్

ఆగస్టు 7 విడుదలకు సిద్ధం “అమ్మా……. నాకు ఆ అబ్బాయి కావాలి”

#NewMovie

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. పవన్ మహావీర్ లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.

హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు – దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు సి.రాంప్రసాద్, శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. “ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని, పవన్ మహావీర్ కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని” అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు.

నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ… “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేసెందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

డాక్టర్ టర్నెడ్ హీరో మహావీర్ మాట్లాడుతూ…. “డాక్టర్ గా వైద్యం… హీరోగా వినోదం అందించాలనే తన సంకల్పం కార్యరూపం దాల్చడానికి కారకురాలైన దేవతలాంటి మా అమ్మకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఈ చిత్రం ఇంత గొప్పగా రావడం కోసం మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆగస్టు 7న మీ ముందుకు వస్తున్న “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రాన్ని ఆదరించి, మా నుంచి మరిన్ని చిత్రాలు వచ్చేలా ప్రోత్సహించగలరు” అని అన్నారు.

దర్శకుడు శివాల ప్రభాకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత శైలజ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్లు వర్షిక, సుహానా… సక్సెస్ మీట్ లో మళ్లీ కలుస్తామని చెప్పి, ఈ చిత్రం సాధించబోయే సంచలన విజయం పట్ల తమకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కిషోర్, ఫైట్స్; నందు, కొరియోగ్రఫీ : భాను మాస్టర్ – మొయిన్ మాస్టర్, సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజ రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివాల ప్రభాకర్.

Related posts

టీఆర్ఎస్ నేతలపై సీతక్క అనుచరుల దాడి

Satyam News

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News

అక్కను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్న బావ హత్య

Satyam News

మమత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Satyam News

ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించండి

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

Leave a Comment