విజయనగరం హోమ్

విజయనగరం లో ఖాకీ నాకా బందీ…!

#NakaBandi

విజయనగరం లో పోలీసులు మంగ‌ళ‌వారం నాకా బంధీ నిర్వ‌హించారు. పోలీస్ స‌బ్ డివిజ‌న్ ప‌రిదిలోని అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిల్లో విస్త్ర‌తంగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఎస్పీ దామోద‌ర్ ఆదేశాల మేర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంంచీ రెండు గంట‌ల‌వ‌ర‌కు డివిజ‌న్ ప‌రిధిలోని అన్ని పోలీస్ స్టేస‌న్ల ఎస్.హెచ్.ఓల లు త‌మ‌,తమ ప‌రిధిల్లో రెండు గంట‌ల పాటు ప్ర‌తీ వాహ‌నాన్ని త‌నిఖీ  చేసారు.

గంజాయి,గుట్కా,కొకైనా ,డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణ‌కు అడ్డ‌క‌ట్ట వేసేందుకే ఈ త‌ర‌హా ఆక‌స్మిక త‌నిఖీలు చేసామ‌ని  విజ‌య‌న‌గ‌రం పోలీస్ స‌బ్ డివిజ‌న్ అధికారి,మ‌హిళా ఎస్సీ,ఎస్టీ డీఎస్పీ గోవంద‌రావు తెలిపారు.లైసెన్స్ లేక‌పోతే కొత్త వెహిక‌ల్ యాక్ట్ ప్ర‌కారం అయిదువేలు వ‌ర‌కు జ‌రీమానా విధించే అవ‌కాశం ఉంద‌న్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువై చాలా చోట్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఎస్పీ ఆదేశాల మేర‌కు మందు తాగిన వాళ్ల‌లో తాగి డ్రైవ్ చేయ‌డాన్ని అరిక‌ట్టేందుకు జ‌రీమానాల‌తో కాకుండా జైలు శిక్ష‌లు ప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

ఈ విధంగా ఎస్.కోట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నాలుగు రోజుల‌లో డీడీల కేసులో పట్ట‌బ‌డ్డ దాంట్లో వ‌రుస‌గా కేసులు పెట్టి వారంద‌రికీ ఏడు నెల‌లు జైలు  శిక్ష ప‌డేలా ఎస్పీ దామోద‌ర్ చ‌ర్య‌లు తీసుకున్నార‌న్నారు. ఒక్క ఎస్.కోట కోర్ట్ ప‌రిదిలో కాకుండా అన్ని స‌బ్ కోర్ట్ ల‌లో ఈ విధంగా జైలు శిక్ష‌లు ప‌డే లా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

మందు కొట్టి వాహ‌నాల‌ను న‌డ‌ప కూడ‌ద‌నేదే పోలీస్ శాఖ ప్ర‌దాన ఉద్దేశ్య‌మ‌న్నారు.ఈ ఆక‌స్మిక త‌నిఖీల్లో వ‌న్ టౌన్ ఎస్ఐ ర‌వి,రూర‌ల్ ఎస్ ఐ అశోక్, టూటౌన్ ఎస్ఐ కృష్ణ‌మూర్తి,పూస‌పాటిరేగ ఎస్ఐ దుర్గా ప్ర‌సాద్‌,డెంకాడ ఎస్ఐమ‌హేష్‌, ఇత‌ర స్టేష‌న్ల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బీహార్‌ సీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో….!!

Satyam News

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

అలవోకగా జగన్ రెడ్డి అబద్ధాలు….

Satyam News

Leave a Comment

error: Content is protected !!