గుంటూరుహోమ్

మంగళగిరి వేదికగా ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026

#NaraBrahmini

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) 2026 సీజన్–1 క్రికెట్ మ్యాచ్‌లకు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో WAPL మ్యాచ్‌లు జరగనున్నాయి.

WAPL 2026 సీజన్–1 ప్రారంభోత్సవ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరగనున్న ప్రారంభోత్సవ మ్యాచ్‌కు ఆమె హాజరై లీగ్‌ను ప్రారంభించనున్నారు.

మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించడం, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులకు మంచి వేదికను అందించడం WAPL ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. ఇటీవలే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో  అంతర్జాతీయ ప్రమాణాలతో ఆదునీకరించిన మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా మంగళగిరి మరోసారి క్రీడా వేదికగా ప్రత్యేక గుర్తింపు పొందనుంది.

ఈ లీగ్‌లో భాగంగా ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రీడాభిమానులకు ప్రవేశం ఉచితంగా ఉంటుంది.

మహిళా క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై WAPL 2026 సీజన్–1ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్

Satyam News

అధికారంతో పాటు బాధ్యతను ఇచ్చే ఖాకీ యూనిఫామ్

Satyam News

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News

‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా హైదరాబాద్

Satyam News

Leave a Comment