ప్రపంచంహోమ్

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

#BilawalBhutto

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్న అనంతరం భారత ప్రభుత్వం నిలిపివేసిన సింధు జలాల ఒప్పందంతో పాకిస్తాన్ గిజగిజలాడుతున్నది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ సింధు జలాల కోసం తపన పడుతున్నది.

ఇంత కాలం భారత్ మెత్తపడుతుందని చూసిన పాకిస్తాన్ ఆశలు తీరకపోవడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టింది. తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై విమర్శలు గుప్పించారు.

పాకిస్థాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన, సింధు నది జలాలు తమ దేశానికి జీవనాధారమని, వాటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని, అయితే అది గౌరవప్రదమైన శాంతి కావాలని, చట్టబద్ధమైన చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం రావాలని పేర్కొన్నారు.

సింధు జలాలను రాజకీయ వత్తిడికి వినియోగించవద్దు

సింధు, పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు వేల ఏళ్లుగా ఈ నదులపై ఆధారపడి జీవిస్తున్నారని బిలావల్ అన్నారు. పాకిస్థాన్ జల హక్కులను దెబ్బతీసే ఏ ప్రయత్నానికైనా దేశవ్యాప్తంగా గట్టి స్పందన ఉంటుందని హెచ్చరించారు. సింధు నదిని ఒత్తిడి సాధనంగా గానీ, రాజకీయ బేరసారాల సాధనంగా గానీ ఉపయోగించకూడదని అన్నారు. ఈ నది పాకిస్థాన్ మనుగడకు ఆధారమని, దీనిపై ఎలాంటి ముప్పు వచ్చినా అది దేశ భద్రతకు సవాలుగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు.

భారత్ సింధు జలాల ఒప్పందాన్ని గౌరవించడం లేదని బిలావల్ ఆరోపించారు. సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి అమలు చేయకపోతే దీర్ఘకాలిక శాంతి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సింధు, జీలం, చెనాబ్ నదులపై పాకిస్థాన్‌కు ఉన్న హక్కులను గౌరవించాలని బిలావల్ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం నీటి సమస్య కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదని, అది దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంగా మారిందని తెలిపారు. సింధ్, బలూచిస్థాన్ వంటి వ్యవసాయ ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు.

మా సంతకం కూడా కావాలి కదా?

ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్ కూడా మాట్లాడారు. భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేయడం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు సవాలుగా మారిందని ఆమె ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని ఏకపక్ష నిర్ణయాలతో నిలిపివేయడం సాధ్యం కాదని, మార్పులు చేయాలన్నా లేదా రద్దు చేయాలన్నా రెండు దేశాల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. గతంలో మూడు యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం కొనసాగిందని, ఇప్పుడు రాజకీయ నిర్ణయాలతో దానిని ప్రశ్నించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా సింధు జలాల ఒప్పందం కేవలం నీటి పంపిణీ ఒప్పందం మాత్రమే కాదని, దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం, పరస్పర సహకారానికి పునాది అని పేర్కొన్నారు. భాగస్వామ్య నదులను ఎప్పటికీ ఆయుధాలుగా మార్చకూడదని, సహకారం, చర్చలు, అంతర్జాతీయ చట్టాల ఆధారంగానే వ్యవహరించాలని అన్నారు. జల ప్రవాహాల్లో ఏకపక్ష మార్పులు ప్రాంతీయ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ, ఈ సదస్సు తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ సమావేశమని పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు.

రక్తం నీరు ఒకే సారి ప్రవహించవు…..

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత భారత్ 1960 సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేసింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ నుంచి పూర్తి స్థాయిలో, తిరుగులేని చర్యలు తీసుకునే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. “రక్తం, నీరు ఒకేసారి ప్రవహించవు” అనే తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది.

సింధు నదీ వ్యవస్థపై అధికంగా ఆధారపడిన పాకిస్థాన్ వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తిపై భారత నిర్ణయం ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నదులలో ప్రవహించే నీటి పరిమాణానికి సంబంధించిన కీలక జల సమాచారాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్ ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో పశ్చిమ నదులపై తన పరిధిలో ఉన్న జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు భారత్ జలవిద్యుత్, నీటి మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసింది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి అమలు చేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

Related posts

మర్రిపాలెం ఉడా లేఔట్లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో పెరుగుతున్న సుఖ వ్యాధులు

Satyam News

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో….. వైసీపీని పేల్చేసిన.. మావిగన్‌..!!

Satyam News

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన డీజీపీ

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : కేంద్ర మంత్రి బండి సంజయ్

Satyam News

Leave a Comment