మహబూబ్ నగర్హోమ్

కరెంటు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతులు

#NiranjanReddyBRS

రైతులు సాగునీరు, విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, రైతులకు సంబంధించిన కీలక మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు కూడా అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మొన్నటివరకు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో పంట వేయవద్దంటూ ముఖ్యమంత్రి, మంత్రులతో హెచ్చరికలు చేయించడం దుర్మార్గమని విమర్శించారు. రైతులకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారిని అయోమయానికి గురిచేస్తోందని అన్నారు.

విద్యుత్‌ సరఫరా సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని, తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్లపైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన కాంగ్రెస్‌ నేతలు విమానాలు ఎక్కి ఢిల్లీకి వెళ్లడమేంటని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై చర్చించాల్సిన సమావేశాలను వాయిదా వేయడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని విమర్శించారు.

కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం పండుగలా ఉండేదని, రైతులు గౌరవంగా జీవించారని నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మళ్లీ గతంలో ఎదుర్కొన్న కష్టాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీల మోసపూరిత హామీలను, అబద్ధాలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భవిష్యత్తులో తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాల్సిన సమయంలో కీలక క్యాబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేసి ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Related posts

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

Satyam News

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

Satyam News

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News

అర్హులైన జర్నిలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు

Satyam News

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

భారత్ ను ముంచెత్తనున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు?

Satyam News

Leave a Comment