జాతీయంహోమ్

ఢిల్లీ ని యుద్ధ రంగం గా మార్చడం కరెక్ట్ కాదు

కాంగ్రెస్ నేత శశి థరూర్ ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటాక రాజధాని చేరుకున్న ఆయనకు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించిందని, ప్రతి వంద మీటర్లకు చెక్‌పోస్టులు, కాంక్రీట్ బ్యారికేడ్లు, రోడ్లపై టైర్లు పంక్చర్ చేసే స్పైక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. నగరవ్యాప్తంగా 22,000 మంది పోలీసులు, అర్ధసైనిక బలగాలను మోహరించారని పేర్కొన్నారు. ఆందోళనకారుల భయంతో 250 రైళ్లను రద్దు చేసి, 45 మెట్రో స్టేషన్లను మూసివేశారని వివరించారు.

ఢిల్లీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతను ఇళ్ల నుంచి, రోడ్ల నుంచి అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల విశ్వసనీయతపై శాంతియుతంగా నిలదీస్తున్న పౌరులను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఎక్స్ వేదికగా విమర్శించారు. రాజధాని నడిబొడ్డున ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అత్యంత అణచివేత చర్య అని పేర్కొన్నారు.

ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించేశారని, కేంద్ర దిల్లీలో నిరసనలకు నిర్దేశిత ప్రాంతమైన జంతర్ మంతర్ కు వెళ్లే దారులను కూడా నిషిద్ధ ప్రాంతాలుగా మార్చారని తెలిపారు. రాజధానిలో నిజంగా రక్షణ అవసరమైనప్పుడు ఈ భారీ బలగాల మోహరింపు, అత్యవసర చర్యలు ఎక్కడికిపోతాయని మహిళలు ప్రశ్నించాలని సూచించారు. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మళ్లీ నిరసనకారులు వస్తే రాజధానిని మళ్లీ లాక్‌డౌన్ చేస్తారా అని ప్రశ్నిస్తూ, మన జెన్-జీ తరం అణచివేత కాకుండా మెరుగైన వాతావరణానికి అర్హమని అన్నారు.

ఎన్నికల పారదర్శకతపై నమ్మకమున్న ప్రభుత్వం ప్రజల ప్రశ్నలను స్వాగతించాలని, కానీ భయంతో రాజధానిని కోటలా మారుస్తున్నారని, ఇది అనుమానాలను మరింత పెంచుతుందని థరూర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం లాఠీఛార్జీలు కాకుండా సమాధానాలు ఇవ్వాలని, అణచివేతకు బదులుగా భావప్రకటనకు అవకాశం కల్పించాలని కోరారు.

బ్యారికేడ్లతో ఎన్నికల సంఘంపై విశ్వాసాన్ని పునరుద్ధరించలేమని, ప్రజల ప్రశ్నలకు తక్షణమే సమాధానం లభించినప్పుడే శాంతి నెలకొంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య నిజమైన బలం పరిపాలనా యంత్రాంగం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ఎలా చూస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని, ఈ కోణంలో చూస్తే నేడు కనిపించిన దృశ్యాలు సిగ్గుచేటు, సమర్థనీయం కాదని శశి థరూర్ వ్యాఖ్యానించారు.

Related posts

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

Satyam News

బెంగళూర్‌ టు అనంతపురం… ఏపీకి భారీ కంపెనీల క్యూ

Satyam News

చిల్కూరు రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం

Satyam News

రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ మిల్లుదే

Satyam News

విద్యార్థుల హాస్టళ్లకు త్వ‌ర‌లో 2.55 ల‌క్ష‌ల దోమ తెర‌లు

Satyam News

ప్రెస్ క్లబ్ సభ్యులకు నిమ్స్ లో మాస్టర్ హెల్త్ చెకప్

Satyam News

Leave a Comment