ఆధ్యాత్మికంహోమ్

కన్నులపండువగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం

#Dasara

శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల తొలి రోజైన ఆదివారం సాయంత్రం జగన్మాత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య నగరోత్సవం అత్యంత నేత్రపర్వంగా జరిగింది.

​కొండపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం (శివాలయం) నుండి ఉత్సవమూర్తుల పల్లకీ ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ మంగళవాయిద్యాలు, కేరళ వాయిద్యాల దివ్య ఘోష, శాక్సాఫోన్ నాదం, భక్తుల కోలాటాలు మరియు గరగ నృత్యాల నడుమ నగరోత్సవం ఆద్యంతం శోభాయమానంగా సాగింది.

​ఈ ఊరేగింపులో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ,సభ్యులు, ఆలయ అధికారులు మరియు వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కొండపై నుండి బయలుదేరిన ఈ ఊరేగింపు కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, కెనాల్ రోడ్డు మరియు ఘాట్ రోడ్డు మీదుగా భక్తుల జయజయధ్వానాల నడుమ తిరిగి కొండపైకి చేరుకుంది.

​అనంతరం ఇంద్రకీలాద్రిపై గల పవిత్ర అమ్మవారి రావిచెట్టు ప్రాంగణం వద్ద స్వామి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా విశేష పూజలు నిర్వహించి, ఆస్థాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. దారిపొడవునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు.

Related posts

ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతి

Satyam News

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News

వేసవిలో నీటి ఎద్దడి రానీయకుండా చెరువులు నింపాలి

Satyam News

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News

టెండూల్కర్ వారి పెళ్లి సందడిలో నారా వారి నవ్వులు!

Satyam News

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News

Leave a Comment