సినిమాహోమ్

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి ఆన్ డ్యూటీ

క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘పోలీస్ కంప్లైంట్’ మూవీతో హిట్ కొట్టిన‌ ఆయన.. ఇప్పుడు కన్నడలో తన అప్‌క‌మింగ్ మూవీ రూపొందించబోతున్నారు.

‘ఆన్ డ్యూటీ’ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించనున్నాడు. ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ జానర్‌లో పలు విభిన్న చిత్రాల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర.. సంజీవ్ మేగోటి చెప్పిన ఈ సరికొత్త కథకు ఓకే చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ రాఘవేంద్ర ఫిల్మోగ్రఫీలో కూడా క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ కథలు కనిపిస్తాయి.

దాదాపు పుష్క‌ర కాలం విరామం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో మళ్లీ దర్శకత్వం వహిస్తున్న సంజీవ్ మేగోటి, ఈసారి క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కథాంశంతో సినిమా తెరకెక్కించనున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన కథలకు భిన్నంగా, నెవర్ బిఫోర్ అనే రీతిలో కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడులైన‌ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో, కొత్త కథనం, విభిన్న స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించేందుకు సంజీవ్ మేగోటి సిద్ధమవుతున్నారు.

విజయ్ రాఘవేంద్ర వంటి స్టార్ హీరో.. సంజీవ్ మేగోటి వంటి విభిన్న కథలను తెరకెక్కించే దర్శకుడు.. క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్.. సరికొత్త స్క్రీన్‌ప్లే.. ఈ కాంబినేషన్‌పై కన్నడ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ తదితర వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Related posts

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News

హవాలా మార్గంలో ‘కల్తీ నెయ్యి’ సొమ్ము

Satyam News

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

కాకినాడలో “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర”

Satyam News

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

Leave a Comment