హైదరాబాద్హోమ్

హైదరాబాద్‌కు సరఫరా చేసే పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కల్తీ

#Milk

హైదరాబాద్ నగర ప్రజలకు సరఫరా చేస్తున్న పాలలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్న కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 6న మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పోచారం గ్రామానికి చెందిన అండె శ్రీశైలం (43)ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు ధోల్పూర్ మిల్క్ పౌడర్ కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ విధంగా తయారు చేసిన పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను ఆహార పదార్థాల్లో కలపడం ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దాడుల్లో స్వాధీనం చేసుకున్నవి:

100 లీటర్ల అనుమానిత కల్తీ పాలు

ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్

కిలో బరువున్న 35 పాలపొడి ప్యాకెట్లు

స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు నిందితుడిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. పాల కొనుగోలు సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

భూమన కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బి ఆర్ నాయుడు

Satyam News

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయం ప్రారంభం

Satyam News

హార్ముజ్‌ జలసంధి దగ్గర చిక్కుకుపోయిన ఆయిల్ నౌకలు

Satyam News

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

Satyam News

హిజ్బుల్లా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

Satyam News

Leave a Comment