ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా బిల్వార్చన ప్రత్యేక పూజలు

Indrakeeladri

కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుంచి బిల్వార్చన ప్రత్యేక పూజను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆలయ స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ బిల్వదళాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రదోషకాలంలో శ్రీ మల్లేశ్వరస్వామి వారికి ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా క్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులు పి. రాఘవరాజు, పద్మావతి ఠాకూర్, ఎం. కళావతి, ఎస్. సరిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ Dino Deets ప్రారంభం

Satyam News

అమరావతిపై వైసీపీ ఫేక్ నెరేటివ్స్…అసలు నిజాలివి.!

Satyam News

6 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Satyam News

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం.. .

Satyam News

Leave a Comment