ప్రపంచంహోమ్

రాజకీయ డ్రామాలు ఆడుతున్న షేక్ హసీనా

#SKHasina

కొత్త పాస్ పోర్టు కోసం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు రాజకీయ డ్రామాగా ఆ దేశ ప్రభుత్వం అభివర్ణించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది.

2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు నేపథ్యంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే నివసిస్తున్నారు. అయితే ఇటీవల డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని హసీనా ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి.

హసీనా తిరిగి రావడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన ప్రాసిక్యూటర్ మహమ్మద్ అమీన్ ఉల్ ఇస్లాం పేర్కొన్నారు. ఆమె ఇటీవల చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలేనని వ్యాఖ్యానించారు. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారన్న వార్తలపై స్పందిస్తూ, ప్రస్తుతానికి ఆమె తిరిగి వచ్చే అవకాశం లేదని, ఈ ప్రచారమంతా రాజకీయ వ్యూహంలో భాగమేనని తెలిపారు.

ఇటీవల ఆమె చేస్తున్న ప్రకటనలు, రాజకీయ కార్యకలాపాలు కేవలం రాజకీయ ప్రచారంలో భాగమేనని ప్రభుత్వ ప్రధాన ప్రాసిక్యూటర్ మహమ్మద్ అమీన్ ఉల్ ఇస్లాం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు పొందేందుకు హసీనా ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హసీనా ఇప్పటికే న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2024లో విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు జరిగిన హింసాత్మక చర్యలకు సంబంధించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ చట్టబద్ధతపైనా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.

ఆమెకు ఎలాంటి ప్రయాణ పత్రాలు లేదా పాస్‌పోర్టు జారీ చేసే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ గత గురువారం స్పష్టం చేశారు. ఆమెను పరారీలో ఉన్న ఉగ్రవాదిగా, నియంతగా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భారత్‌ను కోరింది. ఈ మేరకు అధికారికంగా అప్పగింత అభ్యర్థనలు పంపించింది. వాటిని అందుకున్నట్లు భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించే విషయంపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ అభ్యర్థనలను నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

Related posts

రంపచోడవరం అడవి ప్రాంతంలో పులి సంచారం

Satyam News

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

Satyam News

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

Satyam News

అధికారం కంటే బాధ్యతే ముఖ్యం: అమిత్‌ షా

Satyam News

సరిహద్దులు దాటుతున్న సైబర్ నేర ముఠాలకు చెక్

Satyam News

బీ ఎం ఎస్ జాతీయ అధ్యక్షుడు గా సుంకరి మల్లేశం

Satyam News

Leave a Comment