ఆధ్యాత్మికంహోమ్

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

#jogulambatemple

తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ వద్ద కొలువైన 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

త్వరలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించాలన్న తపన సీఎం కు ఉందని చిన్నారెడ్డి తెలిపారు. రూ. 347 కోట్ల ప్రణాళికలో మొదటి దశలో రూ. 138.40 కోట్లు, రెండవ దశలో రూ. 117.60 కోట్లు, మూడవ దశలో రూ. 91 కోట్లు అవసరం అని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

Related posts

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

Satyam News

16వ సబ్ జూనియర్ హాకీ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam News

డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీస్ అకాడమీలో ఆధునిక శిక్షణ

Satyam News

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News

జగన్ కు నిద్రపట్టకుండా చేస్తున్న మంగళగిరి

Satyam News

Leave a Comment