సంపాదకీయం హోమ్

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

#NaraLokesh

ఏఐలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది.. ఏపీ టాప్‌లో ఉంది… ఈ మాట అంటోంది ఎవరో కాదు.. కేంద్రం.. అవును, ఐటీలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌… ఏఐ ఆధారిత ఉత్పత్తులు, డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు సర్కార్‌ కీలకంగా మారుతోందని వివరించారు అశ్వినీ వైష్ణవ్‌.. వైజాగ్‌లో డేటా సెంటర్లు, అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటుతో ఏపీకి ఏఐ మణిహారాలుగా మారినట్లు వెల్లడించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి.. ఇటు, వృద్ధి రేటులోనూ ఆశించిన స్థాయిని మించి సాధిస్తోందని తెలిపారు..

వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియాలో ఏఐ ప్రపంచ సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు.. దీనికి ఏపీ సర్కార్‌ కీలక భాగస్వామ్యం కానుందని వెల్లడించారు.. వైజాగ్‌కి డేటా కేంద్రాలు వెల్లువలా వస్తున్నాయి. గూగుల్‌, గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, సిఫీ, మెటా సంస్థలు ఏపీలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. గూగుల్‌ కంపెనీకి భూసేకరణ కూడా పూర్తి అయింది.. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్‌ దూకుడుతోనే ఇది సాధ్యం అయింది.. అందుకే, ఏఐకి సంబంధించిన ప్రతి అంశంలోనే కేంద్రం ఏపీని భాగస్వామిగా మార్చుకుంటోంది కేంద్రం..

2026లో దేశవ్యాప్తంగా సుమారు 200 ఏఐ కార్యక్రమాలు నిర్వహించనుంది కేంద్ర సర్కార్‌.. వీటిలో ఏపీ కీలక పాత్ర పోషింస్తుందని వెల్లడించారు అశ్వినీ వైష్ణవ్‌.. డేటా సెంటర్లతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు కేంద్ర ఐటీ మంత్రి.. ముఖ్యంగా వైజాగ్‌ డేటా హబ్‌గా, ఏఐ సెంటర్‌గా మారుతుందని తెలిపారు.. ఈ పరిణామాలతో ఏపీ ఆర్ధికంగానే కాకుండా, సాంకేతికంగా కూడా వృద్ధి చెందడం ఖాయమన్నారు అశ్వినీ వైష్ణవ్‌.

ఈ విషయాలన్నీ ఆయన రాజ్యసభలో వెల్లడించారు.. ముఖ్యంగా చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కార్‌… ఏఐకి ఇస్తున్న ప్రాధాన్యతని ఆవిష్కరించారు.. ఇటు, అమరావతిలో ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు అశ్వినీ వైష్ణవ్‌.. వ‌చ్చే 20 ఏళ్ల‌లో ఏఐ ప్ర‌భావిత రంగాల్లో ఉద్యోగుల‌కు ఇక్క‌డ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. మొత్తమ్మీద, దేశంలోనే ఏఐ, డేటా సెంటర్లకి ఏపీ హబ్‌గా మారనుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. ఏపీకి కితాబు ఇచ్చారు.. చంద్రబాబు విజన్‌, లోకేష్‌ దూకుడుని ఆయన పార్లమెంట్‌ సాక్షిగా కళ్లకు కట్టారు..

Related posts

ఓటమి భయంతో జగన్‌ పరార్‌…!!

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

Leave a Comment

error: Content is protected !!