కరీంనగర్హోమ్

తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న

#PandagaSaianna

తెలంగాణ రాబిన్ హుడ్  పోరాట యోధుడు పండగ సాయన్న అని పలువురు వ్యక్తులు అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం సదర్ పెద్ద మనిషి రాగం లచ్చన్న ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ చౌరస్తాలో గురువారం పండగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాయన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం కేకు కట్ చేసి పంపిణీ చేశారు. నిజాం కాలంలో భూస్వాములు పెత్తందారులు పటేల్లు కర్ణాలు దోపిడీలు ఆగడాల నుంచి రక్షణ కల్పించి ధాన్యాగారాలను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచి వారి ఆకలి తీర్చిన విప్లవ వీరుడని కొనియాడారు. పండుగ సాయన్న ముదిరాజ్  చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఉత్తం రాయమల్లు, జిట్టవేణి అంజిబాబు, రాగం వెంకటి, ఈగ రాజేశం, మామిడి తిరుపతి, జిట్టవేణి రమేష్, మామిడి రాజు, మామిడి సుదర్శన్, సామంతుల మునీందర్, పెసరి రాజమౌళి, బసరవేణి లక్ష్మణ్,   మామిడి తిరుపతి, రాగం సతీష్,  మామిడి సాయితేజ, మన్నే మధు,బోయిని తిరుపతి, వార్డు సభ్యులు  మామిడి శ్రావణ్ కుమార్,సామంతుల సుజాత తిరుపతి  నీలం అరుణ లక్ష్మణ్ కారుపాకల నరేష్ పాల్గొన్నారు.

Related posts

లక్కిరెడ్డిపల్లిలో మహర్షి వాల్మీకి జయంతి

Satyam News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి మరో రూ. 8 వేల కోట్ల సాయం

Satyam News

ధాన్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించిన భారత్

Satyam News

క్యాన్సర్ మందుల తయారీకి సీఐఆర్‌వో ఫార్మా సిద్ధం

Satyam News

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Satyam News

రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

Satyam News

Leave a Comment