కృష్ణహోమ్

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపు

#SaiprasadIAS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు పొడిగించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ, సిబ్బంది మరియు శిక్షణ విభాగం(డిఓపిటి)ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం సిఎస్ పదవీ కాలాన్ని మరోసారి ఆరు మాసాలకు అనగా 2027 మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర సాధారణ పరిపాలన(పొలిటికల్)శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు.

1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జి.సాయి ప్రసాద్ ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తుండగా ఇప్పటికే గత జూన్ 1 నుండి నవంబరు 30 వరకూ 6 మాసాలు ఆయన పదవీ కాలాన్ని పొడిగించగా వచ్చే నెల30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సిఎస్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న కేంద్ర ప్రభుత్వానికి డిఓ లేఖ వ్రాయగా అందుకనుగుణంగా కేంద్రం ప్రభుత్వం ఆమోదించి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్నిమరో ఆరు మాసాలు అనగా 2027 మే 31 వరకూ పొడిగిస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

విషం ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

Satyam News

యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ బిజీ

Satyam News

రాజధాని రైతులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌….!!

Satyam News

బాలికను లైంగికంగా వేధించిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే?

Satyam News

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News

Leave a Comment