25.2 C
Hyderabad
September 20, 2026
విశాఖపట్నంహోమ్

విశాఖకి టాప్ జీసీసీలు…. ఐటీ, ఫార్మాలో భారీ పెట్టుబడులు

#VizagCity

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి గ్లోబల్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, డేటా సెంటర్ల రాకతో ఫుల్‌ జోష్‌తో ఉన్న వైజాగ్‌కి మరో గుడ్‌ న్యూస్‌. జపాన్‌కి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలు.. స్టీల్‌ సిటీలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి.

హెల్త్‌ కేర్‌ రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన.. జపాన్‌కి చెందిన ఈసాయి ఫార్మా విశాఖలో జీసీసీ ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రంలో ఫార్మా రంగానికి చెందిన పరికరాల తయారీకి సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీనికి తోడు వరల్డ్‌వైడ్‌గా ఉన్న ఈసాయి ఫార్మా సంస్థ కార్యాలయాలకు అవసరమైన ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సేవలను విశాఖ జీసీసీ నుంచి అందిస్తారు.

జపాన్‌కే చెందిన ఎన్‌టీటీ డేటా కంపెనీ కూడా తమ జీసీసీ కోసం విశాఖనే ఎంచుకొంది. రుషికొండలోని ఇన్స్‌పైర్‌ ఎడ్జ్‌ భవనంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకోవడానికి కంపెనీ చర్చలు జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విస్తరించిన ఎన్‌టీటీ డేటా… డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, క్లౌడ్‌, ఏఐ, మేనేజ్డ్‌ సర్వీసెస్ విభాగాల్లో ఫార్చ్యున్‌ 100 కంపెనీలకు సేవలు అందిస్తోంది. ఎన్‌టీటీ డేటా సంస్థ విశాఖలోని జీసీసీ ద్వారా గ్లోబల్‌ ఐటీ కన్సల్టెన్సీ సేవలు అందించనుంది.

గతంలో ఎంఎన్‌సీ‌ కంపెనీలు జీసీసీలు ఏర్పాటు చేయాలంటే.. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, నోయిడా వంటి నగరాలను ఎంచుకొనేవి. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు విజన్‌పై నమ్మకం.. ఐటీ మంత్రి లోకేశ్‌ ప్రోయాక్టివ్‌ అప్రోచ్‌.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలతో.. టాప్‌ కంపెనీల జీసీసీలకు విశాఖ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది.

గల్ఫ్‌ దేశాల్లో మాల్స్‌ బిజినెస్‌కి పెట్టింది పేరైన లులులెమన్‌ కూడా విశాఖలో జీసీసీ ఏర్పాటు చేయబోతోంది. వైజాగ్‌లో ఇప్పటికే లులు మాల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే ప్రధాన కేంద్రాన్నీ విశాఖ నగరానికి తీసుకొస్తున్నారు.

Related posts

మరోసారి దొరికిన వైసీపీ డ్రగ్ దొంగలు

Satyam News

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

చదువులో రాణించలేని విద్యార్థులు క్రీడల్లో పోటీ పడాలి

Satyam News

హైదరాబాద్‌ సిటీ లో మొత్తం ఎన్ని గణేష్ విగ్రహాలు ఉన్నాయో తెలుసా?

Satyam News

CBN Target: 2036 ఒలింపిక్స్‌కు వేదికగా అమరావతి

Satyam News

అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!!

Satyam News

Leave a Comment