చిత్తూరు హోమ్

అపోలో జోలికి జగన్ ఎందుకు వెళ్లలేదు?

#jagan

భారతదేశంలో వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం నేడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారం, మరోవైపు అత్యాధునిక వైద్యం కోసం సామాన్యుడి ఆరాటం. ఈ రెండింటినీ సమన్వయం చేసే శక్తి ‘ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య’ (PPP) నమూనాకు ఉందని చిత్తూరు అనుభవం నిరూపిస్తోంది.

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో గ్రూప్ లీజు ప్రాతిపదికన గత చంద్రబాబు హయాంలో తీసుకోవడంపై తొలినాళ్లలో విమర్శలు వచ్చినా, నాటి ప్రతిపక్ష వైకాపా గగ్గోలు పెట్టినా.. నేడు అక్కడి ఫలితాలు ఒక విజయవంతమైన కేస్-స్టడీగా నిలుస్తున్నాయి.జగన్ మౌనం వెనుక రహస్యం ఏమిటి?చిత్రమేమిటంటే, అప్పట్లో చంద్రబాబును విమర్శించిన జగన్.. తన ఐదేళ్ల హయాంలో అపోలో మీద పల్లెత్తు మాట అనలేదు.

కేవలం యాజమాన్యం పట్ల సామాజిక వర్గ అభిమానమా? లేక అక్కడ నాణ్యతలో వచ్చిన విప్లవాత్మక మార్పును చూసి మౌనంగా ఉండిపోయారా? ఇప్పుడు మరింత కట్టుదిట్టమైన పీపీపీ విధానం ద్వారా మరిన్ని జిల్లాలకు మేలు జరుగుతుంటే, “జైళ్లకు పంపిస్తాం” అంటూ బెదిరింపులకు దిగడం రాజకీయ ఉన్మాదం కాక మరేమిటి?

పార్లమెంటరీ స్థాయి సంఘంలో తమ తిరుపతి ఎంపీ సభ్యుడిగా పీపీపీని సమర్థించిన కమిటీ నివేదికను, కోర్టుల తీర్పులను, నీతి ఆయోగ్ నమూనాను తప్పుపట్టే మేధావితనం.. ‘బ్లీచింగ్ పౌడర్ కొట్టుకోమన్న’ జగన్‌కు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను హింసించిన అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినా, ఇంకా రఫ్ఫా రఫ్ఫా రంకెలు వేయడం విడ్డూరం.చిత్తూరు అపోలో: ఒక విజయవంతమైన నమూనాచిత్తూరు జిల్లా ఆసుపత్రి అపోలో పర్యవేక్షణలోకి వెళ్ళాక, అది కేవలం ఆసుపత్రిగా కాకుండా ఒక ఉన్నత స్థాయి బోధనా సంస్థగా (AIMSR) ఎదిగింది.

రేటింగ్: ప్రముఖ విద్యా పోర్టల్స్‌లో (Shiksha వంటివి) ఈ కళాశాలకు 4.1 నుంచి 4.6/5 రేటింగ్ లభిస్తోంది.సేవలు: 300 పడకల స్థాయి నుంచి 850 పడకల భారీ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. రోజుకు 1000-2200 మంది రోగులకు 21కి పైగా స్పెషాలిటీ విభాగాల్లో చికిత్స అందుతోంది.ఇక పీపీపీ వల్ల కలిగే వాస్తవ ప్రయోజనాలు: పీపీపీ విధానంలో ప్రభుత్వం నియంత్రణ కోల్పోదు.

కొత్త నిబంధనల ప్రకారం కన్వీనర్ (స్టేట్) కోటా కింద గతంలో కంటే ఎక్కువ సీట్లు కేటాయించబడతాయి. ఆల్ ఇండియా కోటా ఇవ్వాల్సిన పని లేకుండా, మన రాష్ట్ర మెరిట్ విద్యార్థులకే తక్కువ ఫీజుతో నాణ్యమైన సీట్లు దక్కుతాయి.గత జగన్ హయాంలో ఆక్సిజన్ అందక సంభవించిన విషాదాలు పీపీపీ ఆసుపత్రుల్లో పునరావృతం కావు.

ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆధునిక పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.ఆసుపత్రుల నిర్మాణానికి ఆదా అయ్యే వేల కోట్లను ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు, మందుల సరఫరాకు, గ్రామాలను దత్తత తీసుకుని ‘కమ్యూనిటీ వైద్యం’ అందించడానికి వెచ్చించవచ్చు.

వైద్యం అనేది నాణ్యత లేనిదిగా, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉండకూడదు. ప్రభుత్వం ‘యజమాని’ స్థానంలో కాకుండా ‘నియంత్రణ అధికారి’ (Regulator)గా ఉంటే అద్భుతాలు సాధించవచ్చని చిత్తూరు అపోలో నిరూపించింది. రాజకీయ విమర్శలకు అతీతంగా, పారదర్శక నమూనాలతో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రాణదాతలుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related posts

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

Satyam News

డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి

Satyam News

లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. జగన్ గజ గజ….

Satyam News

Leave a Comment

error: Content is protected !!