విశాఖపట్నంహోమ్

చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించిన రాజ్ నాథ్ సింగ్

#RajnathSingh

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారత నౌకాదళానికి తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

భారత నౌకాదళానికి తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ను మంగళవారం రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఆధునీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారత నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచే కీలక అడుగుగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

విశ్వవిద్యాలయాలు నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని విస్తృత పారిశ్రామిక వ్యవస్థతో హిందుస్థాన్ షిప్‌యార్డ్‌ను మరింత అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నౌకా నిర్మాణానికి అవసరమైన పరికరాలు, సేవలను అందించగలవని, విశ్వవిద్యాలయాలు పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావచ్చని చెప్పారు. సాంకేతిక సంస్థలు డిజిటల్ నౌకా నిర్మాణానికి, నూతన సంస్థలు సముద్ర సాంకేతికతల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ కమాండ్, నావల్ డాక్‌యార్డ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, విశాఖపట్నం పోర్టు వంటి కీలక వ్యవస్థలు ఇప్పటికే ఉన్నందున నగరాన్ని ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రేవుల మౌలిక వసతులు, సరకు రవాణా, పరిశోధన, సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమన్వయం చేసి సమగ్ర నౌకా నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని భారత్ పెంచుకోవాలని రక్షణ మంత్రి అన్నారు. నాణ్యత, వ్యయం, సాంకేతికత, నిర్ణీత సమయంలో నౌకల నిర్మాణం, విశ్వసనీయత వంటి అంశాల్లో భారత నౌకా నిర్మాణ సంస్థలు ప్రపంచంలోని ప్రముఖ సంస్థలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మిత్ర దేశాలకు నౌకల నిర్మాణంతో పాటు మరమ్మతులు, నిర్వహణ సేవలను అందించే స్థాయికి భారత నౌకా పరిశ్రమ ఎదగాలని అన్నారు.

మౌలిక వసతుల కల్పనలో చంద్రబాబు కీలక పాత్ర

గత 26 ఏళ్లుగా చంద్రబాబును తాను బాగా తెలుసునని, రాష్ట్రంలో నౌకా నిర్మాణం, రేవుల మౌలిక వసతులు, సరకు రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఆయన అందిస్తున్న మద్దతు కీలకమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

‘సూర్య’ సుమారు 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఫ్లీట్ సపోర్ట్ షిప్. సముద్రంలో సుదీర్ఘకాలం విధుల్లో ఉండే యుద్ధనౌకలకు ఇంధనం, నీరు, ఇతర అవసరమైన సామగ్రిని అందించడంతో పాటు ప్రాథమిక మరమ్మతులు నిర్వహించేందుకు ఈ నౌకలో ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఈ నౌకతో యుద్ధనౌకలు తరచూ తీరానికి తిరిగి రావాల్సిన అవసరం తగ్గి, సముద్రంలో ఎక్కువ కాలం కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంటుంది.

హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో చేపట్టిన మౌలిక వసతుల విస్తరణతో 45 వేల డీడబ్ల్యూటీ వరకు భారీ నౌకలను నిర్మించి, జలప్రవేశం చేయించే సామర్థ్యం పెరిగింది. భారత నౌకా నిర్మాణ రంగంలో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదగడానికి ఈ చర్యలు దోహదపడతాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Related posts

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

శిథిలావస్థకు చేరుకున్న టిడ్కో ఇళ్లు

Satyam News

ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను నాటాలి

Satyam News

రోడ్డు ప్రమాదం లో హీరో భారత్ కాంత్ మృతి

Satyam News

భోగాపురం ఎయిర్‌పోర్టు..ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్.!

Satyam News

విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Satyam News

Leave a Comment