ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీ, ప్రియాంకలపై పోలీసు కేసు నమోదు

#RahulGandhi

అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రాలపై పోలీసులు కేసులు పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కూడా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిరసనకారులు పోలీసుల పదేపదే హెచ్చరికలను పట్టించుకోకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ భవన్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నిర్వాచన్ సదన్ వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. బుధవారం ఉదయం సుమారు 10.30 గంటలకు ప్రారంభమైన ఈ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకులు తొలుత పోలీసులు ఏర్పాటు చేసిన మొదటి బారికేడును దాటి ముందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నీతి ఆయోగ్ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో బారికేడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు పలుమార్లు ప్రకటించారు. నిరసనకారులు శాంతియుతంగా చెదరిపోయి అక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.

260 మంది నిరసన కారుల అరెస్టు

పోలీసుల ఆదేశాలను నిరసనకారులు పట్టించుకోకుండా ముందుకు సాగడంతో సుమారు 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో 10 మంది ఎంపీలు కూడా ఉన్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు చెప్పారు.

ఆ తర్వాత చాలా మంది నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, మనీష్ ఛత్రత్‌తో పాటు సుమారు 50 నుంచి 60 మంది మద్దతుదారులు అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ కూర్చున్నారని పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు పలుమార్లు కోరినప్పటికీ వారు అక్కడ నుంచి వెళ్లేందుకు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఓ మర్రిచెట్టు కింద బైఠాయించి నిరసన కొనసాగించారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసేందుకు ఇండియా కూటమి ఎంపీల ప్రతినిధి బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చే వరకు తాము అక్కడి నుంచి వెళ్లబోమని వారు స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

చట్టబద్ధమైన ఆదేశాలను పదేపదే ఉల్లంఘించిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడటం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Related posts

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

ఈనెల 23 నుండి శ్రీ శేషదాసుల 141 ఆరాధన ఉత్సవాలు

Satyam News

ఎస్పీ బంగ్లాలో ‘ర్యాంకుల’ రచ్చ…

Satyam News

విజయ్ కి మళ్లీ బ్రేక్ వేసిన గవర్నర్

Satyam News

ఓపెన్ యూనివర్సిటీలో 5 కొత్త కోర్సులకు యూజీసీ అనుమతి

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

Leave a Comment