కరీంనగర్హోమ్

రామడుగులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

#Ramadugu

రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ

ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువతను కాంగ్రెస్ పార్టీ వైపు చైతన్యపరిచేందుకు, ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగించేందుకు యువజన కాంగ్రెస్ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, పల్లె రామ్ రెడ్డి, సిరికొండ సాయి తేజ, మండల సోషల్ మీడియా కన్వీనర్ మిల్కీ, NSUI మండల అధ్యక్షుడు జవ్వాజి అజయ్, పూరేళ్ల రాహుల్, రామ్ ప్రసాద్, శేఖర్, హరిచరణ్, శ్రీనివాస్, విజయ్, మణి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

కేరళ స్టోరీ 2కు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

Satyam News

మొక్కజొన్న రైతుల ఇబ్బందులు తీర్చరా?

Satyam News

దేవుడి భూములకే ఎసరు పెట్టిన పేర్ని నాని!

Satyam News

సుప్రీంకోర్టు సంచలనం.. పెద్దిరెడ్డి పల్స్‌ డౌన్‌….!!

Satyam News

స్కూల్ రిపోర్ట్ కార్డుల పంపిణీలో మీ సేవ రికార్డ్

Satyam News

పోలవరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనుల పరిశీలన

Satyam News

Leave a Comment