కరీంనగర్హోమ్

గ్రామ పంచాయతీ సిబ్బందికి రైన్‌కోట్ల పంపిణీ

#RainCoats

రామడుగు గ్రామ యువ సర్పంచ్, ప్రజా సేవకుడు మహమ్మద్ మొహీజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ తన సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులకు రైన్‌కోట్లను పంపిణీ చేశారు.

వర్షాకాలంలో విధులు నిర్వహించే గ్రామ పంచాయతీ సిబ్బంది వర్షం కారణంగా ఇబ్బందులు పడకుండా, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైన్‌కోట్లను అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం, ఇతర పంచాయతీ సేవలను నిరంతరం అందిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందిని అభినందించారు.

సర్పంచ్ అందించిన రైన్‌కోట్లపై గ్రామ పంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను గుర్తించి సొంత ఖర్చులతో రైన్‌కోట్లు అందించినందుకు సర్పంచ్ మహమ్మద్ మొహీజ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెందోట రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గం వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, ఎండీ ఆరీఫ్, రాగం స్వప్న–రవి, కర్నె శ్రీలత–శ్రీనివాస్, కారుపాకల నరేష్, మామిడి శ్రవణ్ తదితరులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News

లంచం తీసుకుంటూ బుక్కయిన సర్వేయర్

Satyam News

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

ప్రధాన ఎన్నికల అధికారికి సుప్రీంకోర్టు నోటీసులు

Satyam News

Final: విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Satyam News

Leave a Comment