ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్‌స్టాప్ విధించింది. అప్పటికే గాల్లో ఉన్న 4,042 విమానాలకు మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించింది.
ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 11 వేలకుపైగా విమానాల ప్రయాణాలపై ప్రభావం పడగా, వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 10 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి.
2001 తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా గ్రౌండ్‌స్టాప్ విధించడం ఇది రెండోసారి అని సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధించి FAA సాంకేతిక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ప్రాథమికంగా సైబర్ దాడి జరిగినట్లు ఆధారాలు లేవని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు.
