నెల్లూరుహోమ్

గంజాయి కేసులో వైసీపీ లీడర్ కామాక్షి అరెస్ట్!

#AravaKamakshi

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో రూరల్ డీఎస్పీ కీలక వివరాలను వెల్లడించారు. ఈ హత్య వెనుక వైసీపీ లీడర్, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న అరవ కామాక్షి పగ, కుట్ర దాగి ఉందని పోలీసులు ధృవీకరించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్ కాగా 9 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. గంజాయిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న పెంచలయ్య దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇప్పటివరకు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

వీరి నుంచి 7 కత్తులు మరియు 3 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మొత్తం 14 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేయబడిన 9 మందితో పాటు, పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సీపీఎం నేత పెంచలయ్య వైకాపా గంజాయి మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు.

గంజాయి వ్యాపారి అయిన అరవ కామాక్షి తన అక్రమ వ్యాపారానికి పెంచలయ్య అడ్డు వస్తున్నారని భావించి, ఆయనపై తీవ్రమైన కక్ష పెంచుకుంది. తన వ్యాపారాన్ని అడ్డుకుంటున్న పెంచలయ్యను హత్య చేయాలని కామాక్షి పక్కా ప్లాన్ వేసింది. కామాక్షి ప్లాన్ ప్రకారం, ఏకంగా 10 మంది దుండగులు కత్తులతో పెంచలయ్యను దారుణంగా పొడిచి చంపారని పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు ఇప్పటికే మరొక గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షిని పీటీ (ప్రొడక్షన్ ట్రాన్సిట్) వారెంట్ కింద త్వరలోనే పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామని డీఎస్పీ వివరించారు. ఈ హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుండగా, మిగిలిన నిందితుల అరెస్ట్‌తో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వైకాపా నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. ఎక్కడ తమ లావాదేవీలు వెలికిలోకి వస్తాయో అని. ఇప్పటికే అరవ కామాక్షితో అంటకాగిన వైకాపా గ్యాంగ్ పరారైనట్లు నెల్లూరులో చర్చించుకుంటున్నారు.

Related posts

నోబెల్ శాంతి బహుమతికి నవనీతం పిళ్లై

Satyam News

సీఎస్ పదవీ కాలం పొడిగింపుకు మరో రిక్వెస్టు

Satyam News

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News

‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు

Satyam News

39 లక్షల మందికి ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ‘

Satyam News

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News

Leave a Comment