సంపాదకీయంహోమ్

సాక్షిలో కథనం మాడభూషిది కాదా.. ఆ ఆర్టికల్‌ రాసింది ఎవరు..?

#Jagan

అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం చాలదన్నట్లు.. అద్దె గొంతులను అరువు తెచ్చుకొంటున్నారు. పోనీ ఆ రెంట్‌కి తీసుకున్న వాయిస్‌లు అసలైనవా అంటే.. అది కూడా ఫేక్‌ అంట. అమరావతి చట్టబద్దతను పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ.. తమ విధానాన్ని సమర్ధించుకోవడానికి పేద్ద వ్యాసం రాయించుకొని సాక్షి పత్రికలో అచ్చేయించుకొన్నారు.

ఈ వ్యాసంలో కొంతవరకు వికేంద్రీకరణకు మద్దతుగా రాసి.. కాసేపటికి దాన్ని పక్కన పెట్టి మావిగన్‌ను సపోర్టు చేశారు. నల్సార్‌ యూనివర్శిటీ లా ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ఈ వ్యాసాన్ని రాశారని ఆయన పేరు వాడేశారు.

ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ వ్యాసాన్ని ఆ ప్రొఫెసర్‌గారు రాయలేదంట. ఆయన రాసిచ్చిన వ్యాసాన్ని మార్చేసి.. నచ్చిన కంటెంట్ వేసుకొని.. ప్రొఫెసర్‌గారి పేరు ప్రింట్‌ కొట్టేసుకొన్నారని తెలిసింది. ఏం జరిగిందో అర్ధమయ్యాక.. ఆచార్యుల వారు సాక్షి పత్రిక మీద చిందులు తొక్కుతున్నారని సమాచారం.

ఈ తార్‌మార్‌ తక్కర్‌మార్‌ వ్యవహారం వెనుక మాడభూషి శ్రీధర్‌ స్నేహితుడు ఉన్నాడని తెలుస్తోంది. సాక్షిలో ఆయన సొంత ప్రమోషన్‌ కోసం.. ప్రొఫెసర్‌గారి వ్యాసాన్ని వైసీపీ పెద్దలకు నచ్చినట్లు మార్చేశారు. ఇదంతా మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తున్న గుసగుసలే. తన ఆర్టికల్‌ని మార్చేశారని ప్రొఫెసర్‌ గారు ఓపెన్‌గా అయితే ఖండించలేదు.

నల్సార్‌ యూనివర్శిటీ లా ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ గతంలో చాలా కాలం పాటు ఈనాడు పత్రికలో రెగ్యులర్‌గా ఎడిటోరియల్‌ కాలమ్స్‌ రాసేవారు. అందుకేనేమో.. మెజారిటీ ప్రజలను బురిడీ కొట్టించడానికి ఆయన పేరు వాడేసినట్లున్నారు.

అప్పట్లో మాడభూషి తన వ్యాసాల్లో రాజకీయాలతో సంబంధం లేకుండా లీగల్‌ ఇష్యూస్‌ గురించి వివరించేవారు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనకు జాతీయ సమచార కమిషనర్‌ పదవి ఇచ్చింది. ఆ సమయంలో ప్రస్తుత ప్రధానమంత్రి.. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల మీద గట్టిగా ఫోకస్‌ చేశారు.

పబ్లిక్‌ సర్వెంట్‌గా పని చేస్తున్న వారు తమ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని.. ఒక ఆర్టీఐ దరఖాస్తు విషయంలో మాడభూషి శ్రీధర్‌ తీర్పు చెప్పారు. కాకపోతే సర్టిఫికేట్లు, మార్క్స్ లిస్టులు వ్యక్తిగత వివరాలు కాబట్టి వాటిని బయట పెట్టాల్సిన అవసరం లేదని కోర్టు.. ప్రొఫెసర్‌ గారి ఆదేశాలను పక్కన పెట్టిందనుకోండి.

అంత పెద్ద పేరున్న ప్రొఫెసర్‌గారు వైసీపీ ట్రాప్‌లో ఎలా పడ్డారోగానీ.. ఈ వ్యవహారంతో ఆయన ఇమేజ్‌ ఘోరంగా డ్యామేజ్‌ అయింది. వైసీపీ విష పత్రికలో.. ఆ పార్టీ నేతలు చెప్పే అబద్దాలతో పాటు.. ప్రముఖుల పేర్లతో ఫేక్‌ స్టోరీలు ప్రచురిస్తారని ఈ వ్యవహారం ద్వారా అర్ధమవుతోంది. ఇక మీదట ఆ విష రాతలను నమ్మే ముందు.. ప్రతి ఒక్కరు ఫ్యాక్ట్‌ చెక్‌ చేసుకొంటే మంచిది. లేకపోతే అబద్దాలను నిజాలనుకొనే ఫేక్‌ ప్రపంచంలో బతకాల్సి వస్తుంది.

Related posts

శ్రీశైలానికి కాలినడకన చేరుకున్న కర్ణాటక భక్తులు

Satyam News

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

Satyam News

ఆసుపత్రిలో అగ్గి: ముగ్గురు నవజాత శిశువల మృతి

Satyam News

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News

6 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Satyam News

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

Satyam News

Leave a Comment