26.6 C
Hyderabad
September 30, 2026
విజయనగరంహోమ్

గురుపూర్ణిమ సందేశం: వ్యాసో నారాయణో హరి

#GuruPurnami

వ్యాసుడు అంటే నారాయణుడితో సమానమని శ్రీ స్వామి అంతర్ముఖానంద(శ్రీగురూజీ) ప్రవచించారు. భగవాన్ వేద వ్యాస జయంతి. విజయనగరం శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో బుధవారం జరిగింది. దేశ వ్యాప్తంగా శ్రీగురూజీ వద్ద ఉపదేశం పొందిన శిష్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్బంగా బౌధ్ధిక్ మండపంలో శిష్యులనుద్దేశించి శ్రీగురూజీ మాట్లాడారు.18 పురాణాలు, 18 ఉప పురాణాలు..దాదాపు లక్ష శ్లోకాలను భగవాన్ వేద వ్యాసుడు మానవులకు ప్రసాదించారన్నారు. వ్యాసుడు, ఆంజనేయుడు,ద్రౌపది వీరి ముగ్గురూ పుట్టగానే నడిచారని శ్రీ గురూజీ అన్నారు. వ్యాసో నారాయణో హరి అని, వ్యాప్తం చేసేవారే వ్యాసుడన్నారు.

గురువులను గౌరవించి మోక్ష సిద్ది పొందేందుకు  ఈ గురుపూజ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఆధ్యాత్మిక భావనతో ఉన్నవారికే గురువు అన్న అర్ధం, తన బంధాన్ని నుంచీ మోక్షం పొందేందుకు గురువు అవసరము అని శ్రీ గురూజీ ప్రవచించారు. యోగం చేస్తేనే మోక్షం అని కానీ యోగం చేసే ప్రతీ ఒక్కరూ మోక్షానికి చేరరన్నారు.

గురువు సముద్రమని, సాదన ఒక కెరటము…గురు కనుసన్ననలలో ప్రతీ శిష్యుడు మెలగాలన్నారు. మనసు గురు పాదం వద్ద ఉండాలని గురువు లేనిదే మోక్షం సిద్ధించదని శ్రీ అంతర్ముఖానంద అన్నారు. కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానశ్రమంలో జరిగిన భగవాన్ శ్రీ వేద వ్యాస మహర్షి జయంతి కి చుట్టు పక్కన ఊర్లతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచీ భారీ సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు.

Related posts

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News

అమరావతికి త్వరలో రాజధాని హోదా

Satyam News

Leave a Comment