34.1 C
Hyderabad
September 29, 2026
ప్రత్యేకంహోమ్

పులివెందుల ఫైట్: జగన్‌ని వణికిస్తున్న చంద్రబాబు ఫార్ములా!

#Chandra

స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీని వణికిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డ పులివెందుల మున్సిపల్‌ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈసారి పులివెందుల మున్సిపాలిటీని దక్కించుకొంటామని తెలుగుదేశం పార్టీ నేతలు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. దమ్ముంటే.. పులివెందులలో సైకిల్‌ జోరుని అడ్డుకోవాలని ఓపెన్‌ ఛాలెంజ్‌లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాలు, స్థానిక నేతల రాజకీయం తోడై.. ఫ్యాన్‌ పార్టీకి ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి.

ఏడాది క్రితం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ ఎలక్షన్స్‌లో వైసీపీకి డిపాజిట్‌ కూడా దక్కలేదు. మున్సిపల్ పోరులో కూడా సేమ్‌ రిజల్ట్ రిపీట్ అవుతుందని.. పులివెందుల టీడీపీ ఇంఛార్జ్‌ బీటెక్ రవి స్పష్టం చేస్తున్నారు. జగన్ అడ్డాలో.. తెలుగుదేశం పార్టీ ఊపుని.. బీటెక్‌ రవి జోరుని అడ్డుకొని నిలబడే నాయకులు కనిపించడం లేదని వైసీపీ వర్గాలే అంటున్నాయి.

బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితం అవుతున్న జగన్‌.. రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రమే పులివెందులకు వస్తున్నారు. పులివెందుల బాధ్యతలు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి అప్పగించినా.. ఆయన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ దూకుడు వైసీపీ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. ఈ వ్యవహారంలో జగన్‌ ఆయన భార్య భారతిరెడ్డి అసలు లబ్దిదారులని.. వివేకా కేసులో ఏ2 నిందితుడు సునీల్‌ యాదవ్‌ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

జగన్‌ పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొని.. దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దని అదే జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. సరిగ్గా ఈ పాయింటే జగన్‌ని భయపెడుతోంది. గతంలోలాగా బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకొంటే రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించ వచ్చని అనుకున్నారు. అందుకే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయనే నమ్మకం లేదని జగన్‌ పదే పదే చెబుతున్నారు. ఏకగ్రీవాలు లేకుండా వైసీపీ అభ్యర్ధులు పులివెందుల ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేనంత ఘోరంగా ఓడిపోతే.. అది పార్టీకి, అధినేతకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది.

Related posts

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా తుపాకుల స్మగ్లింగ్

Satyam News

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News

ఈడీ దెబ్బతో మళ్లీ జగన్ గుండెల్లో భయం

Satyam News

Leave a Comment