ప్రపంచంహోమ్

అరేబియా సముద్రం నుంచి శత్రు బలగాలను తరిమేస్తాం

#Iran

అరేబియా సముద్రం నుంచి శత్రు బలగాలను తరిమేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక చేశారు. ఇరాన్ యోధులు, హోర్ముజ్ జలసంధి రక్షకుల చేతిలో తమ శత్రువులు తీవ్ర దెబ్బలు తిన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అరేబియా సముద్రాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు కూడా సాహసించలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.

పవిత్ర రక్షణ వారోత్సవాల సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఇరాన్ తీర ప్రాంతాల నుంచి శత్రు బలగాలను అరేబియా సముద్రం వైపు వెనక్కి నెట్టామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అరేబియా సముద్రం కూడా వారి ఉనికి నుంచి విముక్తమవుతుందని హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఖమేనీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచంలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గినట్లు ఒక ఇంగ్లీష్ వార్తా సంస్థ తెలిపింది.

యోధులు, హోర్ముజ్ జలసంధి రక్షకుల చేతిలో మా శత్రువులు బాధాకరమైన దెబ్బలు తిన్నారు. అందువల్ల ఇప్పుడు అరేబియా సముద్రం దాటి ముందుకు వెళ్లేందుకు కూడా వారు సాహసించలేకపోతున్నారు. త్వరలోనే అరేబియా సముద్రం కూడా వారి ఉనికి నుంచి విముక్తమయ్యే సమయం వస్తుంది” అని ఖమేనీ పేర్కొన్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.

Related posts

సాక్షికి పోటీగా రూ. 500 కోట్లతో విజయసాయి రెడ్డి మీడియా!

Satyam News

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News

డెమోగ్రఫీ మిషన్ ప్రారంభిస్తున్నాం…

Satyam News

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News

మావిగన్‌పై జగన్‌ కోరిక తీరాలంటే.. చంద్రబాబు మరో 3 సార్లు..!!

Satyam News

Leave a Comment