25.3 C
Hyderabad
September 29, 2026
మహబూబ్ నగర్హోమ్

యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

#PriyankaIAS

యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్  ప్రియాంక పిలుపునిచ్చారు. గురు పౌర్ణిమ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని షిరిడి సాయిబాబా మందిర ఆవరణలో స్నేహ మిత్ర మండలి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన  స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించడంతో పాటు, రక్తదాత ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ తరహా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సామాజిక సేవలో భాగస్వాములవుతున్న స్నేహ మిత్ర మండలి నిర్వాహకులను ఆమె అభినందించారు.

అనంతరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వినీత్ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయడంతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చని పేర్కొన్నారు. రక్తదాతలను, శిబిర నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ రక్తదాన శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మంజుల రెడ్డి, ఆర్డీఓ రమేష్  సందర్శించారు.

Related posts

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

ఉద్య‌మాల నిప్పుక‌ణిక స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న‌

Satyam News

Leave a Comment