హైదరాబాద్హోమ్

ఉద్యోగులందరూ క్రీడ‌లు, క‌ళ‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలి

#JupalliKrishnaRao

ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ మహేష్‌ దత్‌ హెక్కా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం ఎంతో బిజీగా, పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తుంటారని తెలిపారు. ఉద్యోగి పని సామర్థ్యంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు.  క్రీడ‌లు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుకు శారీర‌క‌, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని మంత్రి అన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉద్యోగులు కేవలం ఫైళ్లు, విధులు, బాధ్యతలకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను కూడా వెలికితీయాలని సూచించారు. గెలుపు, ఓటమి కంటే కార్యక్రమాల్లో పాల్గొనడం, తమ ప్రతిభను ప్రదర్శించడం, సహోద్యోగులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యమని చెప్పారు.

ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు త‌ర‌చుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని జూపల్లి సూచించారు. ఉద్యోగులు బాగా పనిచేస్తే దాని ప్రభావం ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందే సేవలపై ఉంటుందని అన్నారు. విధులతో పాటు ఆటలు, క్రీడలు, పాటలపై ఆసక్తి పెంచుకోవడం వల్ల ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పేర్కొన్నారు.

ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవాలి

భారతదేశానికి ఎంతో ప్రాచీనమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉన్నాయని మంత్రి తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం తమ పిల్లలకు భారతీయ కళలు, సంస్కృతిని నేర్పిస్తున్నారని గుర్తుచేశారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మన పూర్వీకులు అందించిన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

పాటలే ఉద్యమానికి స్ఫూర్తి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. 2011లో ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆట‌పాటలే తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాధాకృష్ణ, తెలంగాణ సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జే. ప్రేమ్, ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్, కల్చరల్‌ సెక్రటరీ యామిని కనకతార తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Satyam News

ఎన్నికల కేసుల నుంచి డి కే అరుణ కు విముక్తి

Satyam News

ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ లు

Satyam News

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

Satyam News

ఆపద మిత్ర లకు హైడ్రా శిక్షణ పూర్తి

Satyam News

Leave a Comment