చిత్తూరుహోమ్

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

#BRNaidu

తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి లత ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం చైర్మన్ దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వాల్మీకేశ్వరస్వామి, శ్రీ మరగతాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తదనంతరం శ్రీ ప్రదోష నంది మండపం వద్ద ఆలయ సంప్రదాయాల ప్రకారం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్, శాంతారాం పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related posts

టెండూల్కర్ వారి పెళ్లి సందడిలో నారా వారి నవ్వులు!

Satyam News

సాక్షికి పోటీగా రూ. 500 కోట్లతో విజయసాయి రెడ్డి మీడియా!

Satyam News

రౌడీ పెరేడ్ చేయించిన నెల్లూరు పోలీసులు

Satyam News

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

Leave a Comment