33.9 C
Hyderabad
September 28, 2026
అనంతపురంహోమ్

నవతరం పార్టీ అనంతపురం జిల్లా కొత్త కమిటీ

#NavataramParty

SC,ST,ముస్లిం మైనారిటీ,మహిళా విభాగాల అధ్యక్షులు, సెక్రటరీలను రాయలసీమ ఇంచార్జి రాయల్ మురళికృష్ణ సమక్షంలో అనంతపురం నవతరం పార్టీ జిల్లా అధ్యక్షులు మునగాల సునీల్ కుమార్ నియమించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నవతరం పార్టీ రాయలసీమ ఇంచార్జి రాయల్ మురళి కృష్ణ మాట్లాడుతూ ఈ రోజు అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో అనంతపురం నగర కమిటీ, వివిధ విభాగల్లో అధ్యక్షులుగా ప్రకటించబడిన నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నా అని అన్నారు.

పార్టీ విధి విధానాలకు కట్టుబడి పని చేయాలని కోరుతున్నా అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో  సామాన్యుడుకి “ఒక్క రూపాయికే పార్టీ టికెట్” ఇస్తామన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ మేయర్,మునిసిపల్ ఛైర్మన్, కార్పొరేటర్,కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయిస్తాం అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

జిల్లా అధ్యక్షులు మునగాల సునీల్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం నగర నూతన SC, ST, ముస్లిం మైనారిటీ, మహిళా విభాగ అధ్యక్షులు,సెక్రటరీలను నియమించడం నవతరం పార్టీ అనంతపురం జిల్లాలో బలోపేతంఅవుతుంది అనడానికి సంకేతం అన్నారు.యువత, మహిళలు నవతరం పార్టీ లో చేరేందుకు ముందుకువస్తున్నారన్నారు.

నవతరం పార్టీ తరఫున ఎన్నుకోబడిన నూతన పదాధికారుల వివరాలు మీడియాకు విడుదల చేశారు. నగర ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షునిగా జీ.నరసింహారాజు, నగర  ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులుగా పటాన్ అలీ,నగర మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా జి.లక్ష్మీ నరసమ్మ, నగర ఎస్టీ సెల్ విభాగానికి అధ్యక్షులుగా రమావత్ మోహన్ నాయక్, నగర ఎస్సీ సెల్ విభాగ కార్యదర్శిగా రమేష్ గాంధీ, నగర యువజన విభాగానికి కార్యదర్శిగా జి.రాజేష్ కుమార్ నియమితులు అయ్యారని తెలిపారు.

Related posts

వెలిగొండ జలసిరులు… అభివృద్ధికి రెక్కలు

Satyam News

మొగుడు పెళ్ళాం కలిసి చంపేసారు….

Satyam News

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

Satyam News

చకచకా 22ఎ నిషేధిత జాబితా భూములకు విముక్తి

Satyam News

అంతర్జాతీయ డేటా గేట్ వే గా వైజాగ్

Satyam News

అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు

Satyam News

Leave a Comment