23.7 C
Hyderabad
September 13, 2026
గుంటూరుహోమ్

అమరావతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్సిటీ

#NaraLokesh

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్‌గా అవతరించే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిష్ఠాత్మక ది యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా – (UWA), అమరావతిలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ కీ పార్టనర్ అయిన వివెన్స్ గ్రూప్‌తో కలసి స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి గ్రాండ్ రోడ్ మ్యాప్ సిద్ధమైంది.

ఏపీ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ స్పెషల్ చొరవతో ఆంధ్రప్రదేశ్ – ఆస్ట్రేలియా మధ్య 4 మేజర్ ఒప్పందాలు కుదిరాయి. అమరావతిలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఆస్ట్రేలియన్ మినిస్టర్ జూలియన్ హిల్ మరియు లోకేశ్ సమక్షంలో అఫీషియల్‌గా సైన్ చేశారు. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెక్టార్లలో ఒప్పందాలు జరిగాయి.

లాస్ట్ ఇయర్ తన ఆస్ట్రేలియా టూర్‌లో జరిపిన చర్చలే ఈ గ్రౌండ్-లెవల్ రిజల్ట్స్‌కి కారణమని మినిస్టర్ నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ డీల్‌లో భాగంగా ఐఐటీ తిరుపతిలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీ-ఆస్ట్రేలియా మధ్య ఉన్న రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా, ఇన్నోవేషన్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్‌కు సరికొత్త తలుపులు తెరుచుకుంటాయని ఆయన ‘X’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

విదేశాల పర్యటనల ఉద్దేశాన్ని కేవలం పేపర్ వర్క్‌కే పరిమితం చేయకుండా, అతితక్కువ టైమ్‌లోనే ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్‌లోకి తెచ్చి చూపించడంలో నారా లోకేశ్ తన విజనరీ మార్క్ చూపిస్తున్నారు. అమరావతి వేదికగా ఆస్ట్రేలియాతో కుదిరిన ఈ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్స్ ఏపీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్వరూపాన్నే మార్చేయనున్నాయి. అమరావతిని వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ హబ్‌గా నిలబెట్టడంతో పాటు, ఏపీ యూత్‌కి గ్లోబల్ ఆపర్స్యూనిటీస్ కల్పించడంలో ఈ ఒప్పందాలు మైలురాయిగా నిలవడం ఖాయం!

Related posts

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News

బీ ఆర్ ఎస్ ను చెప్పి మరీ చితక్కొట్టిన రేవంత్

Satyam News

నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం

Satyam News

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా టాటా చంద్రశేఖరన్?

Satyam News

ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల పై దృష్టి సారించాలి

Satyam News

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News

Leave a Comment