25.2 C
Hyderabad
September 20, 2026
రంగారెడ్డిహోమ్

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ

#SRamachandrarraoBJP

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర నేడు పరిగిలో కొనసాగింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలోని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పరిగి వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించింది. అక్కడ ఉన్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను, ఆవేదనను అడిగి తెలుసుకుంది.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఎన్. రాంచందర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర కల్పించడంలో, సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయడంలో, ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు మండిపడ్డారు.

తాము పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోందని, అధికారులు, మిల్లు యజమానుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బిజెపి నాయకుల ప్రతినిధి బృందంతో చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.

రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రైతాంగ సమస్యల పరిష్కారానికి, ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రైతులకు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి చైర్మన్ ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రాణాలు పోతున్నా వడ్ల రైతుల్ని పట్టించుకోవడం లేదు

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ మార్గదర్శకాలు

Satyam News

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Satyam News

Leave a Comment