26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌… ఢిల్లీలో మంత్రి నారా లోకేష్‌

#NaraLokesh

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న లోకేష్‌కు కూటమి ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

ఢిల్లీ చేరుకున్న వెంటనే లోకేష్ కూటమి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రంలో NDA భాగస్వామిగా TDP పోషించాల్సిన క్రియాశీలక పాత్రపై  సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దేశ రాజధాని రాజకీయాల్లో చంద్రబాబు నాయుడి తర్వాత అదే స్థాయిలో లోకేష్ ఎదుగుతున్నారనే సంకేతాలు ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమయ్యాయి.

ఇక, ఈ పర్యటనలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన  రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ సదస్సులో లోకేష్ పాల్గొంటారు. జాతీయ స్థాయి రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, మేధావుల సమక్షంలో లోకేశ్ తన సరికొత్త విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానాన్ని, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో రాబోయే విప్లవాత్మక మార్పులను ఆయన జాతీయ వేదికపై బలంగా వినిపించనున్నారు. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుడిగా ఎదిగిన లోకేష్..జాతీయ మీడియా దృష్టిని సైతం తన వైపు తిప్పుకుంటూ ఏపీ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

సదస్సు ముగిసిన అనంతరం, పలువురు కేంద్ర మంత్రులను కూడా లోకేష్ కలవనున్నారు. ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌లు లేకపోయినప్పటికీ, కేంద్ర క్యాబినెట్‌లోని కీలక మంత్రులతో లోకేశ్‌ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ పర్యటన ద్వారా అటు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కేంద్ర మద్దతును సాధించడంతో పాటు, జాతీయ రాజకీయాల్లో తన హవాను, తనదైన లీడర్‌షిప్ మార్క్‌ను  లోకేష్ మరోసారి నిరూపించుకుంటున్నారు.

Related posts

విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

Satyam News

గ్రీన్ ఎనర్జీలో ఏపీ గర్జన…సౌత్‌ ఇండియా నంబర్ 1!

Satyam News

శభాష్ సువేందు: చికెన్ నెక్ ప్రాంతం కేంద్రానికి…

Satyam News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Satyam News

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌

Satyam News

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News

Leave a Comment