ముఖ్యంశాలుహోమ్

సెక్రటేరియట్ లో సోలార్ కార్ పార్కింగ్

#KomatireddyVenkatreddy

రాష్ట్ర సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్ ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని,రాష్ట్ర వ్యాప్తంగా CRIF ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు,పురోగతిలో ఉన్న పలు ROB పనుల్లో వేగం పెంచాలనీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు.

శనివారం నాడు డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో రోడ్లు భవనాలు శాఖ పై మంత్రి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో ఈఎన్సి(అడ్మిన్) లింగారెడ్డి, సి.ఈ లు వసంత్ నాయక్,వనజ,ధర్మారెడ్డి, డిసి.ఈ అహ్మద్ అబ్దుల్ అలీ,ఈ.ఈ, రూప్ కరణ్,డి.ఈ రూపారాణి,ఏఈఈ గంగాధర్ పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు పాల్గొన్నారు.

డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయనున్న షిడెడ్ పార్కింగ్(సోలార్ కార్ పార్కింగ్) పనుల పురోగతిపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. సెక్రటేరియట్ కు ఉత్తర భాగంలో చేపట్టిన పనుల పురోగతిని మంత్రికి ఇంజినీర్లు వివరించారు.

గత సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు మొత్తం సచివాలయం బిల్డింగ్ మూడు వైపులా (ఉత్తరం, పడమర, దక్షిణం), ఎలివేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా,బిల్డింగ్ స్ట్రక్చర్ వరకే సోలార్ పార్కింగ్ ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం..సచివాలయ ఉత్తర భాగంలో రెండు వరుసల్లో,దక్షిణ భాగంలో మూడు వరుసల్లో,పడమర భాగంలో ఒక్క వరుసలో సోలార్ ప్యానెల్స్ తో కూడిన కార్ పార్కింగ్ డిజైన్లు ఉండేలా చూడాలన్నారు. సంబంధిత డిజైన్లు అధికారులు మంత్రికి చూపెట్టారు.

26.81 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సోలార్ కార్ పార్కింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.

సోలార్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే సెక్రటేరియట్ కోసం 90వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఈ విద్యుత్ వినియోగం ద్వారా సచివాలయ నెలవారీ విద్యుత్ బిల్లులో 16% ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

CRIF రోడ్లు, సేతుబంధన్,ROB పనుల్లో వేగం పెంచాలనీ,ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారిగా జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ ఇంకా మెరుగవ్వాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇప్పటి వరకు 3,918కి.మీ రోడ్లు, రూ.5159 కోట్లతో 316 పనులు మంజూరు చేశామని అందులో కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, చాలా వరకు పనులు చివరి దశలో ఉన్నాయన్నారు.2025-26కు సంబంధించి  రూ.868 కోట్లతో చేపట్టిన 422.36 కి.మీ రోడ్ల పనుల పురోగతి సంతృప్తికరంగా ఉన్నదని అధికారులను మంత్రి ప్రశంసించారు.

పలు హై లెవెల్ బ్రిడ్జిలు,రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు నిర్ణీత సమయానికి పూర్తవ్వాలనీ సూచించారు.

సేతుబంధన్ పథకం ద్వారా 76 కోట్లతో చేపట్టిన నార్కట్ పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు.

మిర్యాలగూడ,నందిపహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని,దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలు తక్షణం పూర్తి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సి.ఈ వనజను ఆదేశించారు.

కరీంనగర్,మెదక్,నల్లగొండ, ఖమ్మం,మహబూబ్ నగర్,వికారాబాద్,నిజామాబాద్,సిద్దిపేట,మహబూబాబాద్, రంగారెడ్డి పనుల పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంకా బాగా కష్టపడి పనిచేయాలని, మెరుగైన రోడ్లు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యంలో అత్యంత కీలకంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

Satyam News

తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

భగవాన్ సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోడీ

Satyam News

మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం రైతులకు వరం

Satyam News

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో పెరుగుతున్న సుఖ వ్యాధులు

Satyam News

Leave a Comment