30.2 C
Hyderabad
September 11, 2026
సంపాదకీయంహోమ్

పాత FIR..కొత్త డ్రామా..మెగా DSCపై వైసీపీ సెల్ఫ్ గోల్!

#Jagan

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై ఎలాగైనా మచ్చ వేయాలని చూసిన వైసీపీ..తన గోతిలో తానే పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా విమర్శలు చేయబోయి భారీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో రూ.14.5 లక్షలకు టీచర్ ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నారు.. పరీక్ష రాయకుండానే కొలువులు ఇచ్చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ చేసిన హడావుడి..అసలు నిజాలు బయటపడటంతో తీవ్ర హాస్యాస్పదంగా మారింది.

ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏమిటంటే..మోసపోయింది అని వైసీపీ నేతలు చెబుతున్న ఫిర్యాదుదారు రాధిక, అసలు జీవితంలో ఈ DSC పరీక్షే రాయలేదు. కనీసం పరీక్షే రాయని వ్యక్తికి ర్యాంకు ఎలా ఇస్తారన్న చిన్న లాజిక్‌ను గాలికి వదిలేసి బురదజల్లడమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యవహరించారు. వాస్తవానికి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 726/2025 కేసు పూర్తిగా వ్యక్తుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం. ఫిర్యాదు చేసిన రాధిక, నిందితురాలు నాగజ్యోతి ఇద్దరూ ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కళాశాలలో కలిసి చదువుకున్న క్లాస్‌మేట్స్ కాగా, మరో నిందితుడు అడపా భాను ప్రకాశ్ కూడా వీరికి ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తే.

వీరి మధ్య ఈ నగదు బదిలీలు ఏప్రిల్ 13, 2025 నుంచి ఆగస్టు 4, 2025 మధ్య కాలంలో జరిగాయి. అంటే, అసలు కూటమి ప్రభుత్వం అధికారికంగా DSC నోటిఫికేషన్ ఇవ్వడానికి, పరీక్షలు నిర్వహించడానికి ఎంతో ముందు జరిగిన పాత వ్యవహారం ఇది. ఎప్పుడో పాత స్నేహితుల మధ్య జరిగిన మోసపూరిత లావాదేవీలను తీసుకొచ్చి, ప్రస్తుత డీఎస్సీకి ముడిపెట్టడం వైసీపీ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం.

కనీస విచారణ లేకుండా.. ఎక్కడో జరిగిన పాత FIRను పట్టుకుని ప్రభుత్వానికి, రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆపాదించడం ద్వారా వైసీపీ రాజకీయం ఎంత దిగజారిందో స్పష్టమవుతోంది. పాలు తాగే పిల్లి కళ్లు మూసుకుని లోకమంతా చీకటనుకున్నట్లు..ఏదో ఒక పాత కాగితం చూపించి జనాన్ని పదే పదే గొర్రెలను చేయొచ్చన్న భ్రమల్లో ఉన్న వైసీపీ నేతలకు, ఈ వ్యవహారం గట్టి గుణపాఠం చెప్పింది. రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు ప్రచారాలు చేస్తే.. చివరకు ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వేసుకోక తప్పదని ఈ ఉదంతం నిరూపించింది.

Related posts

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

ఆహార కల్తీ నియంత్రణకు సర్వైలెన్స్ టీమ్ (H-FAST)

Satyam News

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ

Satyam News

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

Satyam News

కేరళ సీఎం అభ్యర్ధిపై ఇంకా అనిశ్చితే…

Satyam News

Leave a Comment