కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన చేపలు, చికెన్, మటన్ మార్కెట్ ఏర్పాటు వల్ల చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉపాధి అవకాశం కల్పించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
మోడరన్ మాంసం మార్కెట్ నూతన భవన సముదాయం మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. విశిష్ట అతిధిగా రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. షాప్ రూమ్ ఎమ్మెల్యేతో కలసి రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్తిపాటి పుల్లారావు దృష్టి సారించి కాంప్లెక్స్ నిర్మాణం చేసి మాంసం వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు, డి ఈ రహీం, తెలుగుదేశం పార్టీ నేతలు నెల్లూరి సదా శివరావు, కంచర్ల శ్రీనివాసరావు(రామకృష్ణ ఎలక్ట్రానిక్స్), యార్డ్ ఛైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ ఛైర్మన్ పిల్లి కోటి, మద్దుమాల రవి, తెళ్ళ సుబ్బారావు, ఉప్పుటూరి ప్రసాద్, తుబాటి శ్రీహరి మురకొండ మల్లి బాబు, షేక్ మజ్ను, మాంసం, చేపలు వ్యాపారులు పాల్గొన్నారు.
