ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి వెళుతుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వీరంతా వారి మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వాహనంలో డ్రైవర్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఇద్దరు మగవారు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. వారి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించారు. మృతి చెందిన వారి వివరాలు: కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారద.

మాచర్ల పట్టణం నుండి మండాది రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రమాద స్థలంలో మృతి చెందారు మిగిలిన వారిని108 వాహనం ద్వారా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

Related posts

10వ తరగతి కూడా పాస్ కాని ఉన్నతాధికారి….?

Satyam News

పరారీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి

Satyam News

కేటీఆర్ అక్రమ ఆస్తులపై ఆధారాలు బయటపెట్టిన కాంగ్రెస్

Satyam News

New Record: దేవాదాయ శాఖలో 191 మందికి నియామక ఉత్తర్వులు

Satyam News

విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వ‌త ఆస్తుల క‌ల్ప‌న‌

Satyam News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

Leave a Comment