హైదరాబాద్హోమ్

సేవ్ ఎర్త్ ఫౌండేషన్ కు మదర్ ఇండియా జాతీయ అవార్డ్2026

#KishanReddy

జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ విభాగంలో విశేషంగా కృషి చేస్తున్న సేవ్ ఎర్త్ ఫౌండేషన్ కు స్వదేశీ సంస్థాన్ ఇండియా అయోధ్య యుపి. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ అవార్డులను అయోధ్యలోని సాగర్ కళా భవన్ వేదికగా ప్రదానం చేశారు.

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సేవ్ ఎర్త్ ఫౌండేషన్ మదర్ ఇండియా 2026 కు ఎంపికయింది. అనివార్య కారణాలవల్ల అయోధ్యకి వెళ్లలేక పోయినా సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సురేందర్  కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేతుల మీదుగా మదర్ ఇండియా అవార్డును స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సురేందర్ ను శాలువా తో సత్కరించి మెమొంటోని సర్టిఫికెట్ ని బహూకరించారు.

కేంద్ర మంత్రి  జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి మెరుగైన సేవలు అందించడం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకుల సేవలు అమూల్యమైనవన్నారు. సేవ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సురేందర్ తన జీవిత లక్ష్యంగా స్వచ్ఛంద సేవలో నిమగ్నమై తెలంగాణకు కోటి మొక్కల మణిహారం లక్ష్యంగా ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటడం,

నాలుగు వేలకు పైగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం ధార్మిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలోను పాల్గొంటూ ఇరవై ఐదు వేలకు పైగా భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయడం వందలాది స్కూల్స్ లో పాఠశాల స్థాయి, మండల స్థాయి జిల్లా స్థాయిలలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించడం, వ్యక్తిత్వ వికాసం కోసం నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహించడం ఆయా అంశాలపై చిత్రలేఖనం,

వకృత్వ, వ్యాస రచన పోటీలను నిర్వహిస్తూ వారిని ప్రోత్సహించడం ప్రతిభకు గుర్తింపు నివ్వడం, నిరుపేద విద్యార్థుల కోసం దూర విద్యా విధానాల ద్వారా విద్యను అందించడం శీతాకాలంలో రోడ్డుపై నిద్రిస్తున్న అభాగ్యులకు బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, వేసవిలో పశుపక్షాదులకు నీరు, ఆహారం పెట్టడం, తలసీమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం

స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షన్ రోడ్డు భద్రతా కార్యక్రమాలు, కరోనా, వరదలు, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ నియంత్రణ, మత్తు వ్యసనాలపై అనేక  అవగాహన కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తుండటం వల్ల స్వదేశీ సంస్థాన్ ఇండియా వారి సంస్థ సేవలను గుర్తిస్తూ స్వదేశీ భూషణ్ అదేవిధంగా మదర్ ఇండియా అవార్డును అందజేయడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.

ఇలాంటి నిస్వార్ధ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం. గతంలో అంతర్జాతీయ, జాతీయ అవార్డులు విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఐకాన్, పర్యావరణ మిత్ర, సేవారత్న, వనమాలి,  నెల్సన్ మండేలా ఎక్సలెన్స్ వంటి అంతర్జాతీయ తదితర అవార్డులు పురస్కారాలను పొందడం వారి నిరంతర కృషి కి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన శ్రేయోభిలాషులు సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ప్రతినిధులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఈ గుర్తింపు కు కారణం తనను డైరక్ట్ చేస్తున్న సంస్థ ప్రతినిధులు, నాతో కలిసి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వాలంటీర్స్ అన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు ను పొందడం గర్వంగా ఉంది తమపై మరింత బాధ్యతను పెంచిందని అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మహిపాల్ రెడ్డి, గోషిక విఠలేశ్వర్ విజయ్ కుమార్ డాక్టర్ యాదగిరి, జి రాజేందర్ రెడ్డి, నీలం సురేష్ జయసూర్య, రామచంద్రవర్ధన్, శ్రీలతారాణి దైవం టీమ్ హరికృష్ణ, యజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News

మోక్ష ‘ద్వారం’ వైకుంఠ ఏకాదశి…..

Satyam News

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చనున్న భోగాపురం

Satyam News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Satyam News

భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం

Satyam News

కీసర గుట్ట పై శివ రాత్రి సందడి

Satyam News

Leave a Comment