29.7 C
Hyderabad
September 29, 2026
నల్గొండహోమ్

ఆయకట్టు నీళ్ల కోసం అడ్డంకులు తొలగింపు

#canal

వి బి జి రాంజి కింద ఆసిఫ్ నగర్ కాలువలో పూడికతీతతో పాటు, గుర్రపు డెక్క ,నాచు లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ డి ఆర్ డి ఓ ను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం, అక్కినేపల్లి నుండి చిప్పలపల్లి వరకు ఆసిఫ్ నగర్ కాలువను పరిశీలించారు.

అసిఫ్ నగర్ కాలువలో పూడిక తీత, గుర్రపుడెక్క, నాచు, తూటి ఆకులు ఉండడంవల్ల నీరు కిందికి వెళ్ళటం లేదని, తద్వారా ఆయకట్టుకు నీరందడం లేదని తెలుసుకున్న  జిల్లా కలెక్టర్ మోటార్ సైకిల్ పై సుమారు 4.5 కిలోమీటర్ల వరకు కాలువను పరిశీలించారు.

అనంతరం డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తో మాట్లాడుతూ ఆసిఫ్ నగర్ కాలువలో అవసరం ఉన్న చోట విబీజీ రాంజీ కింద గుర్రపు డెక్క, నాచు, పూడిక తొలగించే చర్యలు చేపట్టాలని,  పనులు చేపట్టేందుకు అంచనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, పనులు చేపట్టే అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేయాలని చెప్పారు. ఆసిఫ్ నగర్ కాలువలో పూడికతీత,గుర్రపు డెక్క,నాచు,తూటి ఆకులు తొలగించేందుకు వీలుగా మార్చి, ఏప్రిల్ నెలలోనే నీటిని ఆపివేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్   నూతనంగా ఏర్పడిన చిప్పలపల్లి గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ అంజిరెడ్డి తో మాట్లాడుతూ మహిళా సంఘ భవనంతో పాటు, గ్రామపంచాయతీ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారా? లేదా అని ఆరా తీశారు.

జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఇరిగేషన్ డి ఈ సునీత,ఏ ఈ శరత్  చంద్ర, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అక్కనపల్లి సర్పంచు రాజు ,ఆర్ఐ సైదులు, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, చిప్పలపల్లి సర్పంచ్ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts

జీగ్రూప్ సుభాష్ చంద్ర అప్పు వివాదం ఏంటి?      

Satyam News

భవన నిర్మాణ అనుమతుల సరళీకరణకు క్రెడాయ్ ప్రశంసలు

Satyam News

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

Satyam News

అమెరికాలో మండిపోతున్న పెట్రోల్ ధరలు

Satyam News

జలం విలువ తెలియని జగన్ చేసిన నష్టం ఇదీ…..

Satyam News

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

Satyam News

Leave a Comment