హైదరాబాద్హోమ్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు

#EtalaRajendar

చట్టసభల్లో ఓబీసీ, బీసీలకు రాజ్యాంగబద్ధంగా 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీసీల చిరకాల డిమాండ్లను సంపూర్ణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ అన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కూడా పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలులో లోపాలు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి హక్కులను సాధించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీసీ సమాజం భావిస్తోందని తెలిపారు. అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్ ఉభయ సభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం సాగుతోందన్నారు.

“ఎవరి వాటా మాకు అక్కర్లేదు.. మా వాటా మాకు కావాలి” అనే నినాదం యావత్ బీసీ సమాజం సంకల్పానికి ప్రతీక అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఈ సమావేశం ప్రతిబింబించిందన్నారు.

బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్ల డిమాండ్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టి, తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన కోరారు.

Related posts

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్

Satyam News

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

Satyam News

మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ ‘పేట్రియాట్’ జూన్ 5 నుంచి జీ5లో…

Satyam News

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News

Leave a Comment