కరీంనగర్హోమ్

29న కరీంనగర్‌లో బీఆర్ఎస్ దీక్షా దివస్ సభ

#kcr

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించనున్నారు. 2009 నవంబర్ 29న అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ, ఉద్యమ పోరాట స్ఫూర్తిని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

నవంబర్ 29న సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Related posts

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై మంత్రి జూపల్లి సమీక్ష

Satyam News

వరాలనిచ్చే అమ్మవారి ఆరాధనకు విశిష్ట ప్రాధాన్యం

Satyam News

ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం.. .

Satyam News

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ సతీమణి

Satyam News

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News

Leave a Comment