మహబూబ్ నగర్హోమ్

కల్వకుర్తిలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ

#Jupalli

జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి మంత్రులు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని, ఆయన అనుసరించిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ సిద్ధాంతాలను స్మరించుకున్నారు.

గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రులు పేర్కొన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో పయనిస్తూ శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related posts

గొర్రెల పెంపకం వృత్తిదారులకు ప్రోత్సాహం

Satyam News

విషాదం వేళ వైసీపీ కుట్ర రాజకీయం..!

Satyam News

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ

Satyam News

బాలికపై అత్యాచారం చేసిన నకిలీ పోలీసులు

Satyam News

ఇది ప్రజాపాలన కాదు… దోపిడి దొంగల పాలన

Satyam News

హజ్ యాత్ర సౌకర్యాలపై సమీక్ష

Satyam News

Leave a Comment