కృష్ణహోమ్

పేద పిల్లలు ఉన్నతంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం

#DolaBalaveeranjaneyaswamy

పేద పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను మంత్రి డిఎస్ బీవీ స్వామి మంగళవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు.

కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను సౌకర్యాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.  పేద పిల్లలకు నాణ్యమైన ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యం అందించి వారిని ఉన్నత స్థాయిలో ఉంచడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.

తిరుపతి, విజయవాడ,విశాఖ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సివిల్స్ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నామని, మరి కొంత మందికి ట్యాబ్ లు ఇచ్చి ఆన్లైన్లో శిక్షణ ఇప్పిస్తున్నామని మంత్రి తెలిపారు.

నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ లాంగ్వేజ్లో శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పేద విద్యార్థులు, యువత అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.  ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Related posts

ప్రియ మిత్రమా ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నది

Satyam News

అమరావతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్సిటీ

Satyam News

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

Satyam News

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

Satyam News

చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించిన రాజ్ నాథ్ సింగ్

Satyam News

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలి

Satyam News

Leave a Comment