రంగారెడ్డిహోమ్

వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం

#SnehaMehraIPS

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మొహ్ర తెలిపారు. ప్రమాదం ఉదయం సుమారు 11 గంటల సమయంలో జరిగినట్లు ఆమె వెల్లడించారు.

సంగారెడ్డి నుంచి తాండూరు వైపు ప్రయాణిస్తున్న బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన ప్రయాణికులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన బాధితులను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటనతో అనంతగిరి ఘాట్ రోడ్డులో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోలీసులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

Related posts

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Satyam News

గుంక‌లాంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

Satyam News

గొడ్డలి పార్టీ వల్ల ఆగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి

Satyam News

ఆన్ లైన్ మోసాలు అరికట్టండి

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

Leave a Comment