విశాఖపట్నంహోమ్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌… వైజాగ్‌లో డెలాయిట్‌

#Deloitte

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల సంఖ్యలో గ్లోబల్‌ ఐటీ, ఏఐ సంస్థలు వైజాగ్‌లో ల్యాండ్‌ అయ్యాయి. లేటెస్ట్‌గా మేజర్ కన్సల్టింగ్‌-ఆడిటింగ్‌ సంస్థ డెలాయిట్‌ వైజాగ్‌లో భారీ విస్తరణ ప్రణాళికతో సిద్ధమైంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు రీ లొకేషన్‌ మెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. డెలాయిట్‌ వైజాగ్ క్యాంపస్‌కి పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్‌ను షిఫ్ట్‌ చేస్తోంది.

బిగ్‌ ఫోర్ ఫర్మ్స్‌గా పేరు గాంచిన డెలాయిట్‌, కేపీఎంజీ, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ సంస్థల్లో మూడు వైజాగ్‌ కేంద్రంగా కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌ సర్వీసులు అందిస్తున్నాయి. విశాఖలో కొత్త క్యాంపస్ ఓపెన్ చేయడానికి ఈ మధ్యే ఈవై సంస్థ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్క కేపీఎంజీ మాత్రమే విశాఖలో లేదు. త్వరలో ఈ కంపెనీ కూడా వైజాగ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

గూగుల్, మెటా, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ జెయింట్స్ వైజాగ్‌లో భారీ డెవలప్‌మెంట్‌ సెంటర్లు నిర్మిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి డెలాయిట్, ఈవై వంటి కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌ సంస్థలు క్యూ కడతాయి. లండన్‌ ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న డెలాయిట్‌ ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో సేవలు అందిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా మొత్తం 4 లక్షల 70 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఆడిటింగ్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్‌ అడ్వైజరీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్, టాక్స్‌ సర్వీసుల్లో డెలాయిట్‌ ఇంటర్నేషనల్‌ జెయింట్‌. గ్లోబల్‌ కార్పొరేట్లలో ఏఐ అడాప్షన్ .. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవలపై వైజాగ్‌ క్యాంపస్‌లో ఫోకస్‌  చేస్తున్నారు. విశాఖలో డెలాయిట్ భారీ విస్తరణ ప్రణాళిక.. నగరంలో జరుగుతున్న అభివృద్దికి అద్దం పడుతోంది.

Related posts

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

సుప్రీంకోర్టు అనుమతి తో భార్య ను కలిసిన ఇమ్రాన్‌ఖాన్‌

Satyam News

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

Satyam News

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

హైడ్రా పెట్టి 2 ఏళ్లు.. కబ్జాల చెరవీడిన భూమి 3325 ఎకరాలు

Satyam News

Leave a Comment