హైదరాబాద్హోమ్

ఆర్ధికంగా సపోర్టు చేసేందుకే సామాజిక పింఛన్లు

#Talasani

సమాజంలోని వృద్ధులు, మానసిక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించేది పెన్షన్ కార్యక్రమమని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం బేగంపేట లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలువురు మానసిక వికలాంగులు, వితంతు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అవసరాల కోసం ఎవరిపై ఆధారపడకుండా ఆర్ధికంగా వారికి అండగా నిలవాలనే ఆలోచనతోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం క్రింద ప్రతినెల ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారి కుటుంబాలలో పెన్షన్ కు అర్హులైన వారిని అనర్హులుగా పేర్కొంటున్నారని అన్నారు.

అదేవిధంగా కొందరు దరఖాస్తు దారుల ఇండ్లకు విచారణకు వెళ్ళిన అధికారులు వారి వద్ద కార్లు ఉంటే కూడా అనర్హులు అంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరారు. అంతేకాకుండా మానసిక వికలాంగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 4 వేల రూపాయల పెన్షన్ ను 6 వేలకు, వితంతు, వృద్ధుల పెన్షన్ ను 4 వేల రూపాయల కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

మూడేళ్ళు కావస్తున్నా పెన్షన్ సాయాన్ని నేటి వరకు పెంచలేదని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వం నూతనంగా మానసిక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ లు మంజూరు చేసిందని, వృద్ధులకు ఎప్పుడు ఇస్తారని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని అన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్ లు పాండు నాయక్, శ్రీదేవి, ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, టి. మహేశ్వరి, కుర్మ హేమలత, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు టి. శ్రీహరి, గందే నాగులు, కె.కిశోర్, శేఖర్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, ఆరీఫ్, అఖిల్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రైవేటు బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు..

Satyam News

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News

9న సువేందు అధికారి ప్రమాణ స్వీకారం?

Satyam News

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News

సొంత కూటమి దేశాలపై ట్రంప్ దారుణ వ్యాఖ్యలు

Satyam News

సింగరేణి కరెంటు జైపూర్ కు: హరీష్ తీవ్ర అభ్యంతరం

Satyam News

Leave a Comment