ముఖ్యంశాలుహోమ్

20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తీవ్ర తుఫాను

#Chandrababu

ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుత పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

రానున్న తుఫాను కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపటంతో పాటు విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. అలాగే భారీ వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Related posts

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

Satyam News

భూ కబ్జాదారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు: రంగ‌నాథ్ (హైడ్రా)

Satyam News

పౌర్ణమి సందర్భంగా శ్రీశైల గిరిప్రదక్షిణ

Satyam News

ఆర్ టి ఐ దరఖాస్తులతో బ్లాక్ మెయిల్…?

Satyam News

అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

Satyam News

ఖమ్మం వైద్యుని సజీవ దహనం

Satyam News

Leave a Comment