ప్రత్యేకంహోమ్

అమరావతిలో ఆస్ట్రో ఫిజిక్స్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం

#AustroPhysics

బ్రహ్మాండం, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్‌ నిర్మాణం వంటి విశ్వాధ్యయనం చేసే శాస్త్రం ఆస్ట్రో ఫిజిక్స్. ఇలాంటి అరుదైన శాస్త్ర జ్ఞానానికి అమరావతి కేంద్రం కానున్నది. ఈ శాస్త్ర విభాగం భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం కలయికగా ఉండి, విశ్వం ఎలా పని చేస్తుందన్న అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది.

ఈ కీలక రంగంలో పరిశోధన, అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన అడుగు పడింది. అమరావతి రాజధాని అభివృద్ధి సంస్థ (APCRDA) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

రాజధానిలో కాస్మాస్ ప్లానెటేరియం స్థాపనకు ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

ప్రపంచ స్థాయి ఖగోళ విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ ప్లానెటేరియంలో విశ్వం, నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు వంటి అంశాలను ఆధునిక 3D డోమ్ ప్రొజెక్షన్‌ల ద్వారా ప్రత్యక్ష అనుభూతి కలిగిస్తూ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానం చేరువ కానుంది. ఖగోళ పరిశోధన, శాస్త్రీయ అవగాహన, శిక్షణ కార్యక్రమాలకు ఇది కేంద్ర బిందువుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అమరావతిలో విజ్ఞానపర్యటన అంటే నాలెడ్జ్ టూరిజంను అభివృద్ధి చేస్తూ, భవిష్యత్తులో పరిశోధన కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖగోళ శాస్త్రంపై యువతలో ఆసక్తి పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ కీలక మలుపు కానుందని నిపుణులు భావిస్తున్నారు. విశ్వ రహస్యాలను అన్వేషించే ఆస్ట్రో ఫిజిక్స్‌ను ప్రజలకు చేరువ చేస్తూ, అమరావతి శాస్త్రీయ రంగంలో ఒక ముఖ్య కేంద్రంగా ఎదగబోతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

Satyam News

New Record: దేవాదాయ శాఖలో 191 మందికి నియామక ఉత్తర్వులు

Satyam News

దాసరి నారాయణరావు ఒక ఇన్స్టిట్యూషన్

Satyam News

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

Satyam News

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

Satyam News

Leave a Comment